యూపీలో భారీ వర్షాలు.. 15మంది మృతి.. కూలిన 133 భవనాలు
ఉత్తరప్రదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత మూడు రోజులుగా ఆ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. సుమారు 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షాలకు 15మంది చనిపోయారని అధికారులు తెలిపారు. అంతేకాకుండా 133 భవనాలు కూలిపోయినట్లు పేర్కొన్నారు. వాన బీభత్సంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే లక్నోలో శనివారం నుంచి మరో ఐదు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత […]
ఉత్తరప్రదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత మూడు రోజులుగా ఆ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. సుమారు 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షాలకు 15మంది చనిపోయారని అధికారులు తెలిపారు. అంతేకాకుండా 133 భవనాలు కూలిపోయినట్లు పేర్కొన్నారు. వాన బీభత్సంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే లక్నోలో శనివారం నుంచి మరో ఐదు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే.