కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. కాంగ్రెస్ దిగ్గజాల సమక్షంలో ప్రమాణ స్వీకారం!

కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. సిద్ధరామయ్య రాజీనామా అనంతరం, ఆ రాష్ట్ర కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈసారి, జ్యోతిష్యురాలు ఆరాధ్య సలహా మేరకు, వేదికను తూర్పు వైపు ఉండేలా సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం మొత్తం బాధ్యతను డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ పూర్తిగా తీసుకున్నారు.

కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. కాంగ్రెస్ దిగ్గజాల సమక్షంలో ప్రమాణ స్వీకారం!
Dk Shivakumar Sworn In As Karnataka Cm

Updated on: Jun 03, 2026 | 4:27 PM

కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. సిద్ధరామయ్య రాజీనామా అనంతరం, ఆ రాష్ట్ర కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ కొత్త ముఖ్యమంత్రితో ప్రమాణ స్వీకారం చేయించారు. డీకే, వీర్ గంగాధర్ అజ్జయ్య పేరు మీద ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ సాంప్రదాయ దుస్తులలో పట్టు పంచె, జుబ్బా, శాలువా ధరించి కనిపించారు.

రాజధాని బెంగళూరులోని లోక్‌భవన్‌లో సాయంత్రం 4:05 గంటలకు ఈ ప్రతిష్టాత్మక ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. శివకుమార్‌తో పాటు దాదాపు 13 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త కేబినెట్‌లో ప్రాంతీయ, సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. అలాగే సీనియర్ నాయకుడు డాక్టర్ పరమేశ్వర కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి కాంగ్రెస్ అధిష్టానం, ప్రముఖ నేతలు హాజరయ్యారు. ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలతో పాటు పలువురు సీనియర్ నాయకులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.

గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్‌లో సాగిన అంతర్గత చర్చల అనంతరం అధిష్టానం డీకే శివకుమార్ వైపు మొగ్గు చూపింది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగా తప్పుకోవడంతో, శివకుమార్‌కు సీఎం పీఠం దక్కింది. ఈ కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో కర్ణాటకలో సరికొత్త పాలన సాగనుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే తొలి రూబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంది.

ఇదిలావుంటే, ఈసారి, జ్యోతిష్యురాలు ఆరాధ్య సలహా మేరకు, వేదికను తూర్పు వైపు ఉండేలా సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం మొత్తం బాధ్యతను డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ పూర్తిగా తీసుకున్నారు.

ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇఖ్కడ క్లిక్ చేయండి..

Follow Us