దీపావళి వేడుకల కోసం యూపీలోని రామజన్మ భూమి అయోధ్య నగరం ముస్తాబవుతోంది. ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ప్రధాని మోడీ ఆదివారం (అక్టోబర్ 23) ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో పర్యటించనున్నారు. అనంతరం స్థానికులతో కలిసి దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ మేరకు అధికార వర్గాలు వెల్లడించాయి. పవిత్ర నగరమైన అయోధ్యలో ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. పవిత్ర నగరం అయోధ్యలో జరిగే మహా వేడుకలో ప్రధాని మోదీ లక్షలాది మంది భక్తుల మధ్య పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు ప్రధాని మోడీ షెడ్యూల్‌ను విడుదల చేశారు..
ప్రధాని మోదీ అయోధ్య పర్యటన వివరాలివే..
ఇదిలా ఉండగా రామ్‌కీ పైడి ఘాట్‌లలో ఆరవ ‘దీపోత్సవ్’ వేడుకలను సకాలంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలను వేగవంతం చేసింది.
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యోగి ప్రభుత్వం మహా ‘దీపోత్సవ్’ వేడుకలను నిర్వహిస్తోంది. 2021లో సరయు నది ఒడ్డున 9 లక్షలకు పైగా మట్టి దీపాలు (దియాలు) వెలిగించి అయోధ్య ప్రపంచ రికార్డు సృష్టించింది. దీనికి ముందు 2020లో 5.84 లక్షల దీపాలు వెలిగించి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 15 లక్షల దీపాలను శ్రీరాముడి జన్మభూమిలో వెలిగించనున్నారు. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సైనికులతో కలిసి దీపావళి..
కాగా.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ప్రధాని మోడీ గత ఎనిమిదేళ్లుగా జవాన్లతో కలిసి దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ప్రధాని మోదీ అక్టోబర్ 24న జమ్మూ కాశ్మీర్‌లో భారత సాయుధ దళాల సైనికులతో కలిసి దీపావళి జరుపుకునే అవకాశం ఉంది. జమ్మూకశ్మీర్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను కూడా సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..