Diwali 2021: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని భారత్-బంగ్లా సరిహద్దుల్లోని ఫుల్‌బరీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు(ఐసిపి) వద్ద బీఎస్ఎఫ్ జవాన్లు, బంగ్లాదేశ్ జవాన్లు పరస్పరం స్వీట్లు పంచుకున్నారు. ఈ సంవత్సరం దీపావళి వేడుకలు బీఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ రవి గాంధీ నేతృత్వంలో ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్ బీఎస్ఎఫ్ నార్త్ బెంగాల్ దళాలు, ఉత్తర బెంగాల్‌లోని ఇన్‌స్పెక్టర్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో జరిగాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ దళాల మధ్య ఐసీపీ పుల్బరీలో స్వీట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇరు దేశాల సైనికులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ మేరకు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.
భారత్‌లో హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలల్లో దీపావళి కూడా ఒకటి. ఈ దీపావళి వేడుకలను దేశ వ్యాప్తంగా ఎంత ఘనంగా జరుపుకుంటారో మనందరికీ తెలిసిందే. ‘చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీక ఈ దీపావళి. ఈ దీపావళి పర్వదినాన.. ప్రజలంతాల లక్ష్మీ దేవిని ఆరాధిస్తారు. సాయంత్రం వేళ ఇళ్లంతా దీపాలతో సుందరంగా అలంకరిస్తారు.
Also read:
Huzurabad Elections – Trs: హుజూరాబాద్ ఓటమిపై గులాబీ బాస్ గుస్సా!.. ఆందోళనలో ఇన్‌చార్జిలు..
Hero Vishal: శ్రీవారి సన్నిధిలో హీరో విశాల్.. కాలినడకన తిరుమలకు చేరిన ఫొటోస్…