Viral: ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ చెక్ చేస్తుండగా కనిపించిన నూడుల్స్ ప్యాకెట్.. డౌట్ వచ్చి ఓపెన్ చేయగా

|

Apr 24, 2024 | 2:05 PM

శ్రీలంక రాజధాని కొలంబో నుంచి ముంబయి వచ్చిన ఓ విదేశీ మహిళ తన లోదుస్తుల్లో బంగారాన్ని దాచి పెట్టి తీసుకొస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. అలానే ముంబై నుంచి బ్యాంకాక్‌ వెళుతున్న ఓ భారతీయుడి బ్యాగేజీలోని నూడ్సుల్స్‌ ప్యాకెట్లలో వజ్రాలను గుర్తించి.. అతడిని అరెస్ట్ చేశారు.

Viral: ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ చెక్ చేస్తుండగా కనిపించిన నూడుల్స్ ప్యాకెట్.. డౌట్ వచ్చి ఓపెన్ చేయగా
Diamonds smuggled in noodle packets
Follow us on

బంగారం, డైమండ్స్ స్మగ్లింగ్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు కేటుగాళ్లు. ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలతో అధికారులనే విస్మయానికి గురి చేస్తున్నారు. తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో… నూడుల్స్‌ ప్యాకెట్లలో దాచిన వజ్రాలను కస్టమ్స్ టీమ్ స్వాధీనం చేసుకుంది. అలాగే బ్యాగేజీ, శరీర భాగాల్లో ఉంచి.. అక్రమంగా తరలిస్తున్న గోల్డ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సొత్తు విలువ  రూ.6.46 కోట్లు ఉంటుందని తెలిసింది. ఈ మేరకు గత వీకెండ్‌లో రూ.4.44 కోట్ల విలువైన 6.815 కేజీల గోల్డ్, రూ.2.02 కోట్ల విలువైన డైమండ్స్ స్వాధీనం చేసుకున్నామని, నలుగురు పాసింజర్స్‌ను అరెస్టు చేశామని సోమవారం రాత్రి అధికారులు స్టేట్మెంట్ విడుదల చేశారు.

ముంబై నుంచి బ్యాంకాక్‌ వెళుతున్న ఓ ఇండియాన్ బ్యాగేజీలోని నూడ్సుల్స్‌ ప్యాకెట్లలో డైమండ్స్ గుర్తించామని, అనంతరం ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. శ్రీలంక కేపిటల్ సిటీ కొలంబో నుంచి ముంబై వచ్చిన ఓ ఫారెన్ మహిళ తన లోదుస్తుల్లో గోల్డ్ దాచి పెట్టి తీసుకొస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆమె దగ్గర నుంచి 321 గ్రాముల బరువైన గోల్డ్ (కడ్డీలు, చిన్నచిన్న ముక్కలు) సీజ్ చేశారు. అబుధాబి, దుబాయ్‌, దోహా,  బహ్రెయిన్‌, రియాద్‌, సింగపూర్‌, బ్యాంకాక్‌, మస్కట్‌ దేశాల నుంచి వచ్చిన భారతీయులను చెక్ చేయగా రూ.4.04 కోట్ల విలువైన 6.199 కేజీల గోల్డ్ గుర్తించినట్లు ఓ అధికారి తెలిపారు. వీరు ఈ బంగారాన్ని మలద్వారం, ఇతర శరీర భాగాలు, బ్యాగేజీలో పెట్టి అక్రమంగా రవాణా చేస్తుండగా గుర్తించినట్లు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..