కోళీకోడ్ విమానాశ్రయానికి ఏడాది ముందే నోటీసులు
కేరళలోని కోళీకోడ్ విమానాశ్రయంలో జరిగిన ఘోర ప్రమాదంలో 21 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డ విషయం తెలిసిందే.
DGCA notices to Kozhikode Airport: కేరళలోని కోళీకోడ్ విమానాశ్రయంలో జరిగిన ఘోర ప్రమాదంలో 21 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానాశ్రయంలో కొన్ని భద్రతా పరమైన లోపాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ గతేడాది ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్‌కి నోటీసులు జారీ చేసింది. రన్‌వే, విమానాలు నిలిపే చోట(అప్రాన్)లో లోపాలు ఉన్న విషయాన్ని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
కాగా ఈ విమానాశ్రయంలో గతేడాది జూలైలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ల్యాండింగ్ సమయంలో వెనుకభాగం దెబ్బతింది. దీనిపై విచారణ జరిపిన డీజీసీఏ అధికారులు విచారణ జరిపి, కొన్ని భద్రతా పరమైన లోపాలు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డీజీసీఏ అధికారులు వెల్లడించారు. రన్‌వేపై పగుళ్లు ఉన్నాయని, అక్కడక్కడా నీరు నిలుస్తుందని, రబ్బరు ముక్కలు కూడా అధికంగా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ విమానాశ్రయంలో విమానాలు దిగడానికి ఏ మాత్రం సురక్షితం కాదని తొమ్మిదేళ్ల క్రితమే తాను తన నివేదికలో తెలిపానని ఎయిర్ సేఫ్టీ నిపుణుడు, మాజీ పైలట్ మోహన్ రంగనాథన్ తెలిపారు.
Read This Story Also: వారికి పరీక్షలు చేయండి.. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు