Viral: నాలుక కోసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన భక్తుడు
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలోని ఒక ఆలయంలో ఒక భక్తుడు తన నాలుకను కోసి, ప్రధాన దేవతకు సమర్పించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. అతడిని ఆస్పత్రిలో జాయిన్ చేశామని.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. భక్తిశ్రద్దలతో దుర్గమ్మ పూజిస్తున్నారు భక్తులు. ముడుపులు, కానుకలు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే మూఢభక్తి జనాలను మూర్ఖులుగా మార్చేస్తోంది. భక్తి పేరుతో కోసం వెర్రిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక భక్తుడు అమ్మవారికి తన నాలుకను సమర్పించి, అందరికీ విస్మయాన్ని కలిగించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలోని రతన్‌గఢ్ దేవి ఆలయానికి వచ్చిన ఒక భక్తుడు తన నాలుకను కోసుకుని, దానిని అమ్మవారి నైవేద్యంగా సమర్పించాడు. ఈ విషయం తెలియగానే స్థానికులు ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ భక్తుడ్ని కౌశాంబికి చెందిన 38 ఏళ్ల సంపత్‌గా గుర్తించి.. జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.. రతన్‌గర్ దేవి ఆలయం భింద్‌లోని లాహర్ నగర్‌లో ఉంది. ఈ ఆలయాన్ని 2015లో నిర్మించారు.
సంపత్, అతని భార్య బన్నో దేవి గంగాస్నానం చేసిన తర్వాత ఆలయానికి వచ్చారని పోలీసులు తెలిపారు. వారు ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. కొద్దిసేపటి తర్వాత, సంపత్ తన నాలుకను బ్లేడ్‌తో కోసుకుని ఆలయ డోర్ ఫ్రేమ్ వద్ద సమర్పించాడని కర్హా ధామ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అభిలాష్ తివారీ తెలిపారు. అతడ్ని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..