ఇండియాలో కోవిడ్ పరిస్థితి దారుణంగా ఉంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన

ఇండియాలో కోవిడ్ పరిస్థితి దారుణంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ఆ దేశానికి తాము చేయగలిగిన సాయమంతా చేస్తామని ఆయన చెప్పారు.

ఇండియాలో కోవిడ్ పరిస్థితి దారుణంగా ఉంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
Covid Situation In India
Follow us

| Edited By: Phani CH

Updated on: Apr 27, 2021 | 9:10 AM

ఇండియాలో కోవిడ్ పరిస్థితి దారుణంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ఆ దేశానికి తాము చేయగలిగిన సాయమంతా చేస్తామని ఆయన చెప్పారు. అసలు పరిస్థితి ఊహించలేనంతగా ఉందని, ఇతర దేశాలకు లోగడ సాయం చేసిన భారత్ నేడిలా క్రైసిస్ ని ఎదుర్కోవడం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు. తాము  ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్లను, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మొబైల్ ఫీల్డ్ హాస్పిటల్స్ ను, లేబోరేటరీని ఇండియాకు పంపుతామని టెడ్రోస్ తెలిపారు. పోలియో, టీబీ సహా వివిధ కార్యక్రమాలకు ఉద్దేశించి పని చేస్తున్న 2,600 మంది నిపుణులను భారత్ లో అధికారులకు, వైద్య సిబ్బందికి సాయపడేందుకు పంపుతున్నట్టు ఆయన తెలిపారు. గత 9 వారాలుగా ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు  పెరుగుతున్నాయన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఇండియాను ఆదుకునేందుకు కొన్ని దేశాలు ముందుకు వస్తున్నాయని, ఇది అభినందించదగినదని పేర్కొన్న ఆయన, మరిన్ని దేశాలు ఈ విషయంలో చొరవ చూపగలవని ఆశిస్తున్నట్టు  చెప్పారు.

భారత్ లో ఒక్కరోజే 2,812 మంది కరోనా రోగులు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య సుమారు 2 లక్షలకు చేరుకుంది. సోమవారం రోజే 352,991 కేసులు నమోదయ్యాయి. అటు అమెరికా, బ్రిటన్ దేశాలతోబాటు తాజాగా  ఫ్రాన్స్ కూడా ఇండియాకు సాయపడేందుకు ముందుకు  వచ్చింది.ఆ  దేశం నుంచి అత్యాధునిక ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, ఇతర వైద్య పరికరాలు ఇండియాకు చేరనున్నాయి. ఇండియా ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలను  ఆదుకోవడం తమ విద్యుక్త ధర్మమని ఫ్రాన్స్ ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతానికి ఈ సాయమే కాకుండా భవిష్యత్తులో మరింత సహాయం చేస్తామని ఆ దేశ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Greater RTC: గ్రేటర్ ఆర్టీసీకి కరోనా కష్టం.. ప్రయాణికులు లేక వెలవెలబోతున్న బస్సులు.. ట్రిప్పుల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు!

సినీపరిశ్రమలో మరో విషాదం.. కరోనాతో హీరోయిన్ మాలా శ్రీ భర్త మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖులు..

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..