డెంగ్యూ దోమలు నీటిలో వృద్ధి చెందుతాయని, అందువల్ల ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని మనందరికీ తెలిసిందే. నీరు నిల్వ ఉన్న చోట, తడి ప్రదేశాలలో డెంగ్యూ దోమలు గుడ్లను పొదుగుతాయని ఇప్పటి వరకు అనుకున్నాం.. అయితే, ఇప్పుడు శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. IIT మండి శాస్త్రవేత్తలు ఇన్‌స్టెమ్ బెంగళూరు సహాయంతో ఇది సగం నిజం మాత్రమే అని కనుగొన్నారు. ఎందుకంటే డెంగ్యూ, జికా వైరస్‌లను వ్యాప్తి చేసే దోమల గుడ్లు నీరు లేకుండా కూడా జీవించగలవని గుర్తించారు. అంతేకాదు..తగిన పరిస్థితులు ఎదురైనప్పుడు అవి తిరిగి వాటి సంఖ్యను పెంచుతాయని చెప్పారు. PLOS బయాలజీ జర్నల్‌లో ఈ మేరకు ఒక నివేదిక ప్రచురించారు.
నివేధిక ప్రకారం.. డెంగ్యూ, జికా వైరస్‌లను మోసే దోమల గుడ్లు నీరు లేకుండా కూడా జీవించగలవని ఐఐటీ శాస్త్రవేత్తలు ఒక పరిశోధనలో కనుగొన్నారు. నీరు లేని చోట దోమల గుడ్లు నిర్జలీకరణ స్థితిలోకి ప్రవేశిస్తాయని ఒక నివేదిక పేర్కొంది. ఈ మేరకు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. దోమల గుడ్లు నీరు లేకుండా కూడా వాటిని సజీవంగా ఉంచగల యంత్రాంగాన్ని కలిగి ఉన్నాయని తమ పరిశోధనలో వెల్లడించారు. ఇది నీటి కొరత వల్ల కలిగే నష్టాన్ని తట్టుకునేలా పిండాలను ఎనేబుల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. . ఇంకా, అవి అధిక కేలరీల లిపిడ్‌లను రీహైడ్రేట్ చేసిన తర్వాత అవి వాటి అభివృద్ధిని పూర్తి చేయడానికి శక్తి వనరుగా ఉపయోగించుకుంటాయి. అయితే, దోమల బెడద, వ్యాపించే వ్యాధులను నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
డెంగ్యూని ఆపడానికి శాస్త్రవేత్తల లాజిక్ ఏమిటి?
దోమల గుడ్లలో నీరు లేకపోయినా వాటిని సజీవంగా ఉంచే ఒక మెకానిజం ఉందని మా పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. దోమల బెడద నివారణతోనే వాటి ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
డెంగ్యూ అనేది సోకిన ఆడ ఎడెస్మోస్కిటో కాటు ద్వారా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్. ఈ డెంగ్యూ వ్యాప్తికి ఈడిస్ ఈజిప్టి అనే దోమ కారణం. దీనిని ఎల్లో ఫీవర్ మస్కిటో అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ డెంగీ దోమలు ప్రధానంగా ఉదయం 7 నుంచి 9 గంటల సయమం వరకు, అలాగే సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య ఎక్కువగా కుడతాయి. కాబట్టి ఈ సమయంలో కుట్టే దోమలపై జాగ్రత్తగా ఉండాలి. ఈ దోమలు చీలమండలు, మోచేతుల దగ్గర ఎక్కువగా కుడతాయి. కాబట్టి ఇది గమనించి జాగ్రత్తగా ఉండాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..