Bomb Threat: కలకలం రేపుతున్న బాంబు బెదిరింపు కాల్స్.. తాజాగా మళ్లీ ఎక్కడంటే
ఇటీవల ఢిల్లీలోని పాఠశాలలకు తరచుగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. గతంలో ఇలా రెండుసార్లు జరగగా.. తీరా బాంబ్ స్క్వాడ్‌లను తీసుకొస్తే బాంబు ఉన్న దాఖలు కనిపించలేవు. ఇప్పుడు తాజాగా మరో ప్రైవేటు పాఠశాలకు బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టిస్తోంది.

ఇటీవల ఢిల్లీలోని పాఠశాలలకు తరచుగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. గతంలో ఇలా రెండుసార్లు జరగగా.. తీరా బాంబ్ స్క్వాడ్‌లను తీసుకొస్తే బాంబు ఉన్న దాఖలు కనిపించలేవు. ఇప్పుడు తాజాగా మరో ప్రైవేటు పాఠశాలకు బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టిస్తోంది. అయితే పుష్పవిహార్ ప్రాంతంలోని అమృత అనే పాఠశాలకు ఉదయం పూట 6.33 AM గంటలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చినట్లు అధికారులు తెలిపారు.అయితే బాంబు బెదిరింపు రాగానే పాఠశాల యాజమాన్యం వెంటనే అప్రమత్తమైంది.
పోలీసులకు సమాచారం అందించి.. పాఠశాలలో ఉన్న విద్యార్థులను ఖాళీ చేయించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే ఈసారి కూడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమారు నెలరోజుల్లోనే ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి. ఏప్రిల్‌లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు.. ఆ తర్వాత ఇండియన్ పబ్లిక్ స్కూల్‌కు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అప్పుడు కూడా తనిఖీలు చేయగా ఏం దొరకలేదు. అలాగే ఇటీవల హైదరాబాద్‌లో కూడా టీసీఎస్ కంపెనీలో ఓ బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఇక్కడ కూడా తనిఖీ చేయగా పేలుడు పదార్థాలు ఉన్నట్లు కనిపించలేవు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..