దేశరాజధాని ఢిల్లీలో రెండు దారుణాలు చోటు చేసుకున్నాయి. నిర్భయ ఘటన తరహాలో మృగాళ్లు రెచ్చిపోయారు. ఓ మహిళపై గ్యాంగ్ రేప్ చేశారు. వివరాల్లోకెళితే.. యూపీలోని ఘాజియాబాద్ బస్సు కోసం వెయిట్ చేస్తున్న మహిళను.. ఐదుగురు నిందితులు కారులో కిడ్నాప్ చేశారు. ఐదుగురు నిందితులు రెండు రోజుల పాటు ఆమెను అపహరించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అతి క్రూరంగా హింసించారు. ఇనుప రాడ్డును ఆమె ప్రైవేట్ పార్ట్‌లో పెట్టారు. నరకం చూపించారు. కీచకుల చర్యతో ఒళ్లంతా గాయాలతో నెత్తుటి ముద్దుగా మారిన ఆమెను రోడ్డుపై పడేసి వెళ్లారు. ఢిల్లీ దగ్గరలోని ఆశ్రమ్ రోడ్డు ఆమెను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు బాధితురాల్ని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స అందించారు. దర్యాప్తులో కొత్త కోణాలు తెరపైకి వస్తున్నాయి. నిందితులకు బాధితురాలికి మధ్య కోర్టు ఆస్తివివాదాలున్నట్టు గుర్తించారు ఘజియాబాద్ పోలీసులు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందులు దిను, షారుఖ్, జావేద్, ధోలా, ఔరంగజేబ్ ఐదుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. ఈ కేసు విచారణ జరుగుతోంది.
మరోవైపు ఢిల్లీలో సూట్ కేసు మర్డర్ మరో సంచలనంగా మారింది. గురుగావ్ ఏరియాలోని ఇఫ్‌కో చౌక్‌లో రోడ్డుపక్కన పొదల్లో ఓ సూట్ కేసు కన్పించింది. అనుమానాస్పదంగా భావించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకునన పోలీసులు సూట్‌కేసు ఓపెన్ చేస్తే.. నగ్నంగా మహిళ శవం కనిపించింది. ఒంటిపై తీవ్ర గాయాలున్నాయి.
వెంటనే పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు పోలీసులు. సిగరెట్‌తో కాల్చిన వాతలున్నట్టు వైద్యపరీక్షల్లో గుర్తించారు. గొంతు పిసికి హత్య చేసినట్టు డాక్టర్లు నిర్దారించారు. ఆమె చేతిపై టాటూ వుంది. టాటూతో ఆమె ఐడెంటీటీ తెలిసిపోతుందన్న కన్నింగ్ ఐడియాతో నిందితులు పచ్చబొట్టుకు కత్తిగాట్లు పెట్టారని అంచనాకు వచ్చారు పోలీసులు. స్పాట్‌లో దొరికిన ఆనవాళ్ల ఆధారంగా మృతురాల్ని యూపీలోని సుల్తాన్‌పూర్‌కు చెందిన ప్రియాంక గుర్తించారు పోలీసులు. ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక హత్య అతని పనేనా? లేక మరేదైనా కోణం వుందా? అనేది తేలాల్సి వుంది. ఇలా ఘాజియాబాద్‌లో గ్యాంగ్ రేప్.. గురుగావ్‌లో సూట్ కేసులో శవం.. ఈ రెండు ఘటనలతో ఢిల్లీ అలజడి చెలరేగింది.
A Delhi woman was abducted&gang-raped by 5 men in Ghaziabad (UP)
SP City (Ghaziabad) says, “On 18 Oct, Nandgram(UP)Police received info that a woman is lying near Ashram Road. Police took her to hospital. She’s a resident of Delhi&had come to her brother’s residence in Nandgram” pic.twitter.com/RYRqpGHEv9
— ANI (@ANI) October 19, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..