Delhi violence : ఇప్పటి వరకు 123 కేసులు.. 630 మంది అరెస్ట్..

దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న ఘర్షణల్లో ఇప్పటి వరకు 123 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు ఢిల్లీ పోలీస్ అధికారి ఎమ్ఎస్ రాందవ తెలిపారు. శుక్రవారం వరకు 123 ఎఫ్ఐఆర్‌లతో పాటుగా.. 630 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

Delhi violence : ఇప్పటి వరకు 123 కేసులు.. 630 మంది అరెస్ట్..
Follow us

|

Updated on: Feb 29, 2020 | 7:11 AM

దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న ఘర్షణల్లో ఇప్పటి వరకు 123 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు ఢిల్లీ పోలీస్ అధికారి ఎమ్ఎస్ రాందవ తెలిపారు. శుక్రవారం వరకు 123 ఎఫ్ఐఆర్‌లతో పాటుగా.. 630 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరంతా ఢిల్లీలో జరిగిన అల్లర్లకు కారకులుగా భావిస్తూ అరెస్ట్ చేశారు. పెట్రోల్ బాంబు దాడులపై కూడా ప్రత్యేకంగా మరో 25 ఎఫ్ఐఆర్‌లను నమోదు చేసినట్లు తెలిపారు.

ఇప్పటి వరకు ఢిల్లీలో జరిగిన ఈ అల్లర్లలో.. కానిస్టేబుల్‌తో పాటు.. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మతో సహా.. 42 మంది మృతి చెందారని పేర్కొన్నారు. దాదాపు 200 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం అల్లర్లు జరిగిన ప్రాంతం.. ప్రశాంతంగా ఉందని.. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ అల్లర్లపై దర్యాప్తుకు రెండు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలను నియమించారు.