Delhi Heavy Rain: ఢిల్లీలో 121 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. కుండపోత వానకు చిగురుటాకులా వణుకుతున్న మహానగరం..!

దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న కుండపోత వానకు చిగురుటాకులా వణికిపోతోంది మహానగరం.

Delhi Heavy Rain: ఢిల్లీలో 121 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. కుండపోత వానకు చిగురుటాకులా వణుకుతున్న మహానగరం..!
Delhi Heavy Rains
Follow us

|

Updated on: Sep 11, 2021 | 6:49 PM

Delhi Heavy Rain: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న కుండపోత వానకు చిగురుటాకులా వణికిపోతోంది మహానగరం. భారీ వర్షానికి రహదారులన్ని జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రోడ్లపై మోకాలిలోతు నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ఇక దేశ రాజధానిలో శుక్రవారం నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో 121 ఏళ్ల రికార్డు బద్దలయింది.

భారీ వర్షాలకు ఢిల్లీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలతో ఢిల్లీలోని నారేలా ప్రాంతంలో ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. కుటుంబసభ్యు అప్రమత్తతతో ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. మధు విహార్‌, జోర్‌బాగ్‌, మోతీబాగ్‌, ఆర్‌కేపురం, సదర్‌ బజార్‌ ప్రాంతాలు నీటితో రోడ్లు నిండిపోయాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాణిఖేదాలోని అండర్‌పాస్‌ మొత్తం నీటితో మునిగిపోయింది. రేపు ఉదయం వరకు భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితులతో సెప్టెంబర్‌ 16 17 తేదీల్లో కుంభవృష్టి కురుస్తుందని పేర్కొంది. ఢిల్లీలో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ.

దీంతో ఢిల్లీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ పూర్తిగా నీటమునిగింది. ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేతో పాటు టెర్మినల్లోకి కూడా భారీగా వరదనీరు చేరింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు పలు విమానాలను దారి మళ్లించారు. అయితే, ఎయిర్‌పోర్టులో నీటిని తొలగిస్తున్నామని.. విమానాల రాకపోకలను త్వరలోనే పునరుద్ధరిస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఇటు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు ప్రయాణికులు. కార్లు, బస్సులు నీటమునిగిపోయాయి.

ఇక ఢిల్లీ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో మొన్నటి నుంచి భారీవర్షం కురుస్తోంది. ఢిల్లీలో చరిత్రలో 121 సంవత్సరాలలో అత్యధికంగా 24 గంటల్లో వర్షపాతం నమోదైంది. ఢిల్లీ చరిత్రలో సెప్టెంబర్‌ నెలలో 390 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 1944 లో 417 మిమీ తర్వాత 77 సంవత్సరాలలో అత్యధికం ఇదే కావడం విశేషం. ఢిల్లీలో 4 నెలల్లో 1139 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 46 సంవత్సరాలలో అత్యధికం. 1975 లో 1155 మిమీ కంటే తక్కువ అని ఐఎండీ అధికారి ఆర్‌కె జెనమణి తెలిపారు.

నిన్న కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కొనసాగింది. ఇవాళ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం నమోదైంది. దేశ రాజధాని సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో అయితే ఏకంగా 94.7 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఢిల్లీకు సంబంధించి 46 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యధిక వర్షపాతమని ఐఎండీ వెల్లడించింది. భారీవర్షాల కారణంగా ఢిల్లీ రోడ్లపై నీరు పెద్దఎత్తున చేరింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక దేశ రాజధాని రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ఢిల్లీలో 987.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 81 శాతం ఎక్కువని ఐఎండీ అధికారులు తెలిపారు.

Read Also… AP Covid 19: ఏపీ కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు.. ఒక్కరోజులో గణనీయంగా తగ్గిన కేసులు.. పెరిగిన మరణాలు..!