Republic Day: ఇవాళ రిపబ్లిక్ డే రిహార్సల్ పరేడ్.. పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లీంపు.. పూర్తి వివరాలు..

గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీ కర్తవ్యపథ్‌లో రిహార్సల్స్‌ అదిరిపోతున్నాయి.

Republic Day: ఇవాళ రిపబ్లిక్ డే రిహార్సల్ పరేడ్.. పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లీంపు.. పూర్తి వివరాలు..
Republic Day Rehearsal Parade

Updated on: Jan 23, 2023 | 9:09 AM

Republic Day rehearsal parade: గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీ కర్తవ్యపథ్‌లో రిహార్సల్స్‌ అదిరిపోతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ఫుల్‌ డ్రస్‌ రిహార్సల్స్‌ నిర్వహిస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. విజయ్ చౌక్ నుండి ప్రారంభమై.. కర్తవ్య పథ్‌, తిలక్ మార్గ్, నేతాజీ సుభాష్ మార్గ్ మీదుగా ఎర్రకోట వద్ద ముగుస్తుంది రిపబ్లిక్ పరేడ్‌. ఈ నేపథ్యంలో పరేడ్‌ ముగిసే వరకు విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు వాహనాలను అనుమతించడం లేదు.

మరోవైపు రిపబ్లిక్‌ డే నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రత పెంచారు అధికారులు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు, జమ్ముకశ్మీర్‌లో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. జమ్ములో జంట పేలుళ్ల నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించారు. అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. హోటల్స్‌, మాల్స్‌లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

ఇక ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, పారామిలిటరీ బలగాల రెజిమెంట్‌లు అద్భుతమైన కవాతులు నిర్వహిస్తున్నాయి. సరికొత్త క్షిపణులు, విమానాలు, ఆయుధ వ్యవస్థలతో భారతదేశ రక్షణ శక్తిని ప్రదర్శించే విధంగా రిహార్సల్స్ నిర్వహించారు. ఇక వివిధ రాష్ట్రాల శకటాలు రిపబ్లిక్‌ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..