Congress Satyagraha: కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్ష ప్రారంభం.. రాజ్‌ఘాట్‌ దగ్గర టెన్షన్.. టెన్షన్..

|

Mar 26, 2023 | 11:11 AM

దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్ష ప్రారంభమైంది. దీక్షలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే, ప్రియాంక గాంధీ, జైరాం రమేష్‌, కేసీ వేణుగోపాల్ సహా కాంగ్రెస్‌ అగ్రనేతలు పాల్గొన్నారు.

Congress Satyagraha: కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్ష ప్రారంభం.. రాజ్‌ఘాట్‌ దగ్గర టెన్షన్.. టెన్షన్..
Congress
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్ష ప్రారంభమైంది. దీక్షలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే, ప్రియాంక గాంధీ, జైరాం రమేష్‌, కేసీ వేణుగోపాల్ సహా కాంగ్రెస్‌ అగ్రనేతలు పాల్గొన్నారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటును నిరసిస్తు కాంగ్రెస్ పార్టీ సంకల్ప్ సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చింది. పరువు నష్టం కేసులో శిక్షపడి, ఎంపీగా అనర్హతను ఎదుర్కొంటున్న రాహుల్‌ గాంధీకి సంఘీభావంగా ఈ దీక్షలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్‌ అధిష్టానం తెలిపింది. అన్ని రాష్ట్రాలు, జిల్లా కేంద్రాలలో గాంధీ విగ్రహాల ఎదుట ఈ నిరసనలు జరుగుతున్నాయి.

అయితే, ఢిల్లీ పోలీసులు ఈ సత్యాగ్రహ దీక్షకు అనుమతి నిరాకరించారు. పోలీసుల అనుమతి లేకపోయినా దీక్ష ప్రారంభించారు కాంగ్రెస్‌ నేతలు. దీంతో రాజ్‌ఘాట్‌ దగ్గర పోలీసులను భారీగా మోహరించారు.

ఇవి కూడా చదవండి

గాంధీభవన్ లో ఏఐసీసీ ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ దీక్ష జరుగుతుంది. పరువు నష్టం కేసులో శిక్షపడి, ఎంపీగా అనర్హతను ఎదుర్కొంటున్న రాహుల్‌ గాంధీకి సంఘీభావంగా ఈ దీక్షలు చేపట్టారు.

రాహుల్.. @ డిస్ క్వాలిఫైడ్ ఎంపీ..

రాహుల్‌ గాంధీ తన ట్విట్టర్ అకౌంట్ బయోను అప్‌డేట్‌ చేశారు..రాహుల్ గాంధీ అనర్హత వేటు పడడంతో తన ట్విట్టర్‌ బయోను డిస్ క్వాలిఫైడ్ ఎంపీకి అప్‌డేట్ చేశారు రాహుల్‌.

మరిన్ని జాతీయ వార్తల కోసం..