లోక్ సభ సమరం ప్రారంభమైంది.. ఇప్పటికే.. రెండు విడతల పోలింగ్ ముగియగా.. మరో ఐదు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ప్రధానంగా.. రిజర్వేషన్ల అంశంపై రాజకీయ రచ్చ నడుస్తోంది.. ఈ క్రమంలోనే ఫేక్ వీడియోలు అంతకంటే జోరుగా సర్క్యులేట్ అవుతుండటం జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లన్నీ తొలగిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నట్లుగా ఒక వీడియో వైరల్ అవుతోంది. తెలంగాణలో ఇటీవల అమిత్ షా పర్యటించిన విషయం తెలిసిందే.. అయితే, సిద్దిపేటలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపణలు వస్తున్నాయి.
దీనిపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ రంగంలోకి దిగింది. ఈ ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఫేక్ వీడియోను అప్‌లోడ్ చేసిన వారి కోసం ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్- IFSO అధికారులు వేట మొదలుపెట్టారు. ఈ వీడియో ఎక్కడ నుంచి అప్‌లోడ్ అయింది.. ఎవరు చేశారు.. అనే విషయాలను సేకరించేందుకు ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తును ప్రారంభించింది.
అయితే, తెలంగాణ కాంగ్రెస్ విభాగం ఈ ఫేక్ వీడియోను ప్రచారం చేస్తోందని బీజేపీ IT విభాగం ఇన్‌ఛార్జ్ అమిత్ మాలవీయ ఆరోపించారు. ముస్లింలకు ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్‌ను తొలగించడంపైనే అమిత్ షా మాట్లాడారనీ, కానీ రిజర్వేషన్లు అన్నింటినీ తొలగిస్తామని చెప్పలేదంటూ పేర్కొన్నారు. ఇలాంటి వీడియో సర్క్యులేట్ చేసినవారు న్యాయపరమైన పరిణామాలకు సిద్దం కావాలన్నారు.
.@INCTelangana is spreading an edited video, which is completely fake and has the potential to cause large scale violence.
Home Minister Amit Shah spoke about removing the unconstitutional reservation given to Muslims, on the basis of religion, after reducing share of SCs/STs and… pic.twitter.com/5plMsEHCe3— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) April 27, 2024
కాగా.. రిజర్వేషన్ల చుట్టూ రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో ఈ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అటు జాతీయ.. ఇటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..