Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తు సంస్థలు స్పీడ్ పెంచాయి. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈడీ మరోసారి విచారించారు. తీహార్ జైల్లో ఉన్న సిసోడియాను ఈడీ అధికారులు గురువారంనాడు ప్రశ్నించారు. ఈ కేసులో ఆయన్ను ఈడీ అధికారులు ప్రశ్నించడం ఇది రెండోసారి. ఈనెల 7వ తేదీన కూడా మనీష్ సిసోడియాను ఈడీ విచారించింది. లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాను ఫిభ్రవరి 27న సీబీఐ అరెస్ట్ చేసింది. జ్యుడీషియల్ రిమాండ్‌పై ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. లిస్కర్ స్కామ్ కేసులో అరెస్టు కావడంతో సిసోడియా ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు.
ఛార్జ్‌షీట్‌లో ఉన్న ఆరోపణలపై సిసోడియాను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా సెల్‌ఫోన్ల ధ్వంసంపై ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ఎక్సైజ్ శాఖ మంత్రిగా సిసోడియా తీసుకున్న నిర్ణయాలపై కూడా ప్రశ్నిస్తున్నారు.
కాగా సిసోడియాను కరుడు గట్టిన నేరగాళ్లతో కలిపి జైల్లో ఉంచారంటూ ఆప్ జాతీయ అధికార ప్రతినిధి సౌరభ్ భట్టాచార్య అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ విషయంలో కోర్టు ఇచ్చిన అనుమతులను జైలు అధికారులు నిరాకరిస్తున్నారని ఆరోపించారు. జైలు అధికారుల నిర్ణయం వెనుక కేంద్ర పెద్దల ప్రమేయం ఉందని ఆరోపించారు. అయితే జైలు అధికారులు ఆప్ నేతల ఆరోపణలను తోసిపుచ్చారు. జైలు రూల్స్ మేరకే సిసోడియాకు జైల్లో వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆయనకు జైల్లో సరైన భద్రత కల్పించినట్లు వెల్లడించారు.
మరోవైపు సిసోడియా బెయిల్ పిటిషన్ రేపు కోర్టులో విచారణ జరుగుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 11న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి