
ఢిల్లీ, జూన్ 28: ప్రమాదం జరిగింది.. కారణం మీరంటే..మీరంటూ ఆరోపణలు.. నష్టం మాత్రం జరిగింది. ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి..? కారణం ఎవరు..? అనేది తేలాల్సింది… తేల్చాల్సింది. ఢిల్లీ రైల్వే స్టేషన్ ముందు జరిగిన ఘటన అందరిని కలిచివేిసంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఆవరణలో ఆదివారం విద్యుదాఘాతం కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు సాక్షి అహుజా, ఢిల్లీలోని ప్రీత్ విహార్ నివాసి, ఆమె బంధువులతో ఉదయం 5:30 గంటలకు స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్ బయట ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురైంది. ఆమె భోపాల్ శతాబ్ది రైలు ఎక్కబోతుండగా ఈ ఘటన జరిగింది. రైల్వే స్టేషన్ వెలుపల నీటి ఎద్దడి ఉన్న ప్రాంతంలో నిలబడకుండా ఉండేందుకు మహిళ స్తంభాన్ని పట్టుకుని ఉండొచ్చని ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
సంబంధిత అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించిన ఫిర్యాదు స్వీకరించబడింది మరియు కేసు u/s 287/304-A IPC నమోదు చేయబడింది. FSL, రోహిణి బృందం సంఘటన స్థలాన్ని పరిశీలిస్తోంది. దర్యాప్తు కొనసాగుతోంది. తమ వేదనను వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. తన కుమార్తె అకాల మరణానికి న్యాయం చేయాలని కోరుతూ యువతి తండ్రి చోప్రా డిమాండ్ చేశారు. వారి నిర్లక్ష్యానికి సంబంధిత అధికారే బాధ్యులని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే తమ కూతరు మరణించిదని అన్నారు. కుమార్తె, తండ్రి ఇద్దరు కలిసి చండీగఢ్‌కు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది.
ఇలాంటి ఘటనలు జరిగనప్పుడు రెండు ప్రభుత్వ రంగ సంస్థలు ఒకరిపై ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం కామన్. అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇలాంట ఘటనలు జరుగుతూనే ఉంటాయి. వర్షాలు పడుతున్న సమయంలో విద్యుత్ ప్రమాద ఘటనలు చాలా జరుగుతుంటాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగిన ఘటనలను మనం చాలా సార్లు చూశాం. ప్రమాదం జరిగనప్పుడు హడావిడిచేయడం.. ఆతర్వాత ఎవరి దాడి వారిది అన్నట్లుగా ఉంటోందని ప్రజలు మండిపడుతున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవడం అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు.
వర్షం కురిసనప్పుడు విద్యుత్ వైర్లు తెగిపడటం, విద్యుత్ ట్రాన్ఫార్మర్లు పెలిపోవడం, విద్యుత్ వైర్లపై చెట్లు విరిగిపడటం ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. వర్షాకాలం కంటే ముందే భారీగా పెరిగిన చెట్లను కట్ చేయడం. విద్యుత్ పోల్స్ సరైన స్థితిలో ఉన్నయో.. లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం