
Delhi CM Arvind Kejriwal: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు 80 రోజుల నుంచి రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల ఆందోళనకు మద్దతుగా కిసాన్ మహా పంచాయత్ సభలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. దీనిలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ‘కిసాన్ మహా పంచాయత్’ సభ నిర్వహించనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం ట్వీట్ చేసి వెల్లడించింది. ఈనెల 28న పార్టీ నిర్వహించే సభలో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగిస్తారని ప్రకటించింది.
రైతుల ఆందోళన ప్రారంభం నాటినుంచే ఆప్ మద్దతును ప్రకటించింది. అంతేకాకుండా కేజ్రీవాల్ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులను కూడా పలుమార్లు కలిసి సంఘీభావం తెలిపారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎమ్మెల్యేలు సైతం రైతులను కలిశారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లో పార్టీను బలోపేతం చేసేందుకు ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ రైతులకు మద్దతుగా సభలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
Also Read: