Arvind Kejriwal: కరెన్సీ నోట్లపై ఆ చిత్రాలను ముద్రించాలి.. కొత్త డిమాండ్ తెరమీదకు తెచ్చిన ఢిల్లీ సీఏం..

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేశుడి చిత్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ కరెన్సీ..

Arvind Kejriwal: కరెన్సీ నోట్లపై ఆ చిత్రాలను ముద్రించాలి.. కొత్త డిమాండ్ తెరమీదకు తెచ్చిన ఢిల్లీ సీఏం..
Arvind Kejriwal

Edited By: Amarnadh Daneti

Updated on: Oct 26, 2022 | 3:32 PM

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేశుడి చిత్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ కరెన్సీ నోట్లపై ఒకవైపు గాంధీజీ, మరోవైపు లక్ష్మీ, గణేష్‌ల బొమ్మలు వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. అన్ని నోట్లను మార్చాలని మేం చెప్పడం లేదని, అయితే ముద్రించే కొత్త నోట్లపై లక్ష్మీ, గణేశుడి బొమ్మ ఉండాలని చెబుతున్నామని అన్నారు. హిందువుల ఆరాధ్యదైవానికి వ్యతిరేకంగా మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ చేసిన ప్రకటన, దీపావళి నాడు బాణసంచా నిషేధం నిర్ణయం తర్వాత అరవింద్ కేజ్రీవాల్ హిందూ వ్యతిరేకి అని ప్రతిపక్షాలు నిరంతరం ఆరోపిస్తున్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం ధనవంతులు కావాలని మేము కోరుకుంటున్నాము, దీని కోసం అనేక చర్యలు తీసుకోవలసి ఉంటుంది. మంచి పాఠశాలలు, ఆసుపత్రులు, మౌలిక వసతులు ఉంటాయి. దేవతామూర్తుల ఆశీస్సులు ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు. ఇండోనేషియా ముస్లిం దేశమని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అక్కడి జనాభాలో 85% ముస్లింలు, 2% హిందువులు, అయినప్పటికీ వారు కరెన్సీపై గణేష్ చిత్రాన్ని ముద్రించారు. భారత కరెన్సీపై ఒకవైపు గాంధీజీ, మరోవైపు లక్ష్మీ, గణేష్ చిత్రపటం పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానని అన్నారు.

దేవుడిని పూజిస్తున్నప్పుడు ఈ ఆలోచన వచ్చింది:

దీపావళి సందర్భంగా లక్ష్మీ-గణేష్ పూజ చేస్తున్నప్పుడు ఈ ఆలోచన వచ్చిందని కేజ్రీవాల్ అన్నారు. దేవుని ఫోటోలు ముదించడం వల్ల భగవంతుని ఆశీస్సులు పొందుతారని అన్నారు. ఇండోనేషియా ఈ పని చేయగలిగితే.. మనం ఎందుకు చేయలేము? అని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి