Arvind Kejriwal: ప్రజల తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నా: ఓటమిపై అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారంటే..

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత హస్తిన పీఠంపై కాషాయ పార్టీ జెండా ఎగురవేసింది.. 70 అసెంబ్లీ స్థానాల్లో 48 సీట్లలో ఆధిక్యంతో ఉంది.. ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.. ఇక కాంగ్రెస్ పార్టీ అసలు ఖాతానే తెరువలేదు.. ఎలాంటి ప్రభావం కూడా కనిపించలేదు.. కేవలం బీజేపీ - ఆప్ పార్టీల మధ్యనే పోటీ కనిపించింది..

Arvind Kejriwal: ప్రజల తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నా: ఓటమిపై అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారంటే..
Arvind Kejriwal

Updated on: Feb 08, 2025 | 4:35 PM

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత హస్తిన పీఠంపై కాషాయ పార్టీ జెండా ఎగురవేసింది.. 70 అసెంబ్లీ స్థానాల్లో 48 సీట్లలో ఆధిక్యంతో ఉంది.. ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.. ఇక కాంగ్రెస్ పార్టీ అసలు ఖాతానే తెరువలేదు.. ఎలాంటి ప్రభావం కూడా కనిపించలేదు.. కేవలం బీజేపీ – ఆప్ పార్టీల మధ్యనే పోటీ కనిపించింది.. దాదాపు 12 ఏళ్ల తర్వాత కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ.. ఢిల్లీలో అధికారం కోల్పోయింది.. అయితే.. ఆ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ సైతం న్యూఢిల్లీ స్థానంలో ఓటమి పాలయ్యారు.. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ పై బీజేపీ నేత పర్వేష్ వర్మ విజయం సాధించారు. అయితే.. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమిపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రజల తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నామని ఆప్ అధినేత కేజ్రీవాల్ పేర్కొన్నారు. విజయం సాధించిన బీజేపీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ప్రజల ఆశలను బీజేపీ నెరవేరుస్తుందని అనుకుంటున్నా.. బీజేపీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నా.. అంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం.. ప్రజా సమస్యలపై మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని.. ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

వీడియో చూడండి..

ఆప్‌ పాలనలో10 ఏళ్లలో ఢిల్లీలో చాలా అభివృద్ధి పనులు చేశామని.. విద్య, వైద్యం, తాగునీటి విషయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కృషి చేశామని.. ఢిల్లీలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశామన్నారు. ఆప్ కార్యకర్తలు ఎన్నికల్లో బాగా పనిచేశారు వారికి అభినందనలు అంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..