Maharashtra: శివసేన నేత సంజయ్ రౌత్ పై పరువు నష్టం దావా.. క్షమాపణలకూ డిమాండ్

శివసేన(Shiv sena) ఎంపీ, రాజ్య సభ మెంబర్ సంజయ్‌ రౌత్‌పై(Sanjay Routh) పరువునష్టం దావా దాఖలైంది. ఆధారాలు లేకుండా టాయిలెట్ స్కామ్ పేరుతో సామ్నా పత్రికలో వస్తున్న కథనాలు తమ పరువుకు భంగం కలిగిస్తున్నాయంటూ...

Maharashtra: శివసేన నేత సంజయ్ రౌత్ పై పరువు నష్టం దావా.. క్షమాపణలకూ డిమాండ్
Sanjay Routh
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 23, 2022 | 9:42 PM

శివసేన(Shiv sena) ఎంపీ, రాజ్య సభ మెంబర్ సంజయ్‌ రౌత్‌పై(Sanjay Routh) పరువునష్టం దావా దాఖలైంది. ఆధారాలు లేకుండా టాయిలెట్ స్కామ్ పేరుతో సామ్నా పత్రికలో వస్తున్న కథనాలు తమ పరువుకు భంగం కలిగిస్తున్నాయంటూ బీజేపీ లీడర్, ప్రొఫెసర్‌ మేధా బాంబే హైకోర్టులో రూ.100కోట్లకు దావా వేశారు. అంతే కాకుండా ఇకపై ఆ కథనాలను ప్రచురించకుండా ఉండటంతో పాటు క్షమాపణలు చెప్పాలని పిటిషన్ లో పేర్కొన్నారు. మహారాష్ట్ర(Maharashtra) బీజేపీ లీడర్ కిరీట్‌ సోమయ్య కుటుంబసభ్యులు ఓ ఛారిటబుల్ ట్రస్ట్ ను నడిపిస్తున్నారు. అయితే, బాంబే శివారులోని మీరా భయందర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో రూ.100కోట్ల టాయిలెట్‌ స్కామ్‌ జరిగిందని ఆరోపిస్తూ శివసేనకు చెందిన సామ్నా పత్రికలో వరస కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ విషయమై స్కామ్ లో సోమయ్యకూ భాగస్వామ్యం ఉందని సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. మళ్లీ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇతర మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, వీటిని ఖండించిన కిరీట్‌ సోమయ్య సతీమణి ప్రొఫెసర్‌ మేధా.. ఎటువంటి ఆధారాలు లేకుండానే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

మీడియాలో వచ్చిన కథనాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత నెలలో ప్రొఫెసర్ మేధా పోలీసులను ఆశ్రయించారు. మీడియాలో వస్తోన్న వార్తలు తన పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని చెబుతూ బాంబే హైకోర్టులో దావా వేశారు. ఇందులో భాగంగా తనకు రూ.100కోట్ల మేరకు నష్ట పరిహారం పొందే అర్హత ఉందని, వాటిని సీఎం రిలీఫ్‌ ఫండ్‌లో జమచేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

RBI Governor: వడ్డీ రేట్ల పెంపుపై సంచలన కామెంట్స్ చేసిన రిజర్వు బ్యాంక్ గవర్నర్.. వచ్చే సమావేశంలో..

Shekar: ‘శేఖర్’ మూవీ వివాదంలో జీవితా రాజశేఖర్ గెలుపు.. న్యాయస్థానం ఏమన్నదంటే

ఇవి కూడా చదవండి