కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు రోజులే మిగిలి ఉన్నవేళ కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం లీగల్ నోటీసు పంపింది. ఎన్నికల సంఘం పంపిన నోటీసుల ప్రకారం కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ‘బీజేపీ అవినీతి రేటు’, ‘ట్రబుల్ ఇంజన్’ పేరుతో ప్రకటనలు ఇచ్చింది.దీనిపై ఎన్నికల సంఘానికి రాష్ట్ర బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బీజేపీ తన ఫీర్యాదులో ప్రధాన నిందితులుగా ఉన్న రాహుల్ గాంధీ, డీకే శివకుమార్, సిద్ధరామయ్యకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు పంపింది.
ఈ క్రమంలోనే బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రచురించిన ప్రకటనకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని డీకే శివకుమార్‌కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. అలాగే ఈసీ తన నోటీసులో ‘ప్రభుత్వ విధానాలను విమర్శించే హక్కు ఉంది. అయితే ప్రకటన అనేది సాధారణ ఆరోపణ కాదు. ప్రభుత్వ పాలనా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా తప్పుపట్టారు. ఇది సజావుగా జరిగే ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుంది. అంత పెద్ద యాడ్ ఇచ్చారంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర తప్పక రుజువు ఉండాలి. మీ ఆరోపణలకు తగిన రుజువులను మే 7 సాయంత్రం 7 గంటలలోగా ఎన్నికల సంఘం ముందు చూపించాల’ని ఈసీ ఆ నోటీసులలో పేర్కొంది.
चुनाव आयोग ने कर्नाटक कांग्रेस के अध्यक्ष डीके शिवकुमार को एक समाचार पत्र के विज्ञापन के लिए भाजपा से प्राप्त शिकायत के संदर्भ में नोटिस जारी किया है जिसमें निराधार लेकिन विशिष्ट जानकारी का आरोप लगाया गया है।
कांग्रेस को 7 मई की शाम 7 बजे तक का समय दिया गया है कि वह नियुक्तियों… pic.twitter.com/OBtOmUzkc5
— ANI_HindiNews (@AHindinews) May 6, 2023
మరోవైపు అధికార బీజేపీ తమను కించపరిచే విధంగా ప్రకటనలు చేసినందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లకు క్రిమినల్ పరువు నష్టం లీగల్ నోటీసులు జారీ చేసింది. సోమవారంలోగా తమ ప్రకటనను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని, లేకుంటే పరువు నష్టం కేసు పెడతామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశవప్రసాద్ నోటీసు జారీ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..