ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ ది హత్యా ? ఆత్మహత్యా ?
ఢిల్లీలోని ఎయిమ్స్ కి చెందిన 40 ఏళ్ళ డాక్టర్ మృతదేహాన్ని కుళ్లిపోయిన స్థితిలో కనుగొన్నారు. సౌత్ ఢిల్లీ గౌతమ్ నగర్ లో గల తన ఇంట్లోఇతని డెడ్ బాడీ సీలింగ్ ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది...
ఢిల్లీలోని ఎయిమ్స్ కి చెందిన 40 ఏళ్ళ డాక్టర్ మృతదేహాన్ని కుళ్లిపోయిన స్థితిలో కనుగొన్నారు. సౌత్ ఢిల్లీ గౌతమ్ నగర్ లో గల తన ఇంట్లోఇతని డెడ్ బాడీ సీలింగ్ ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది. ఇతడిని డాక్టర్ మోహిత్ సింగ్లా గా గుర్తించారు. లోపలి నుంచి లాక్ చేసి ఉన్న గది నుంచి దుర్వాసన వస్తోందని చుట్టుపక్కలవారు ఇచ్చిన ఫిర్యాదుతో తాము తలుపులు బద్దలు గొట్టి లోపలికి వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్ కి వేలాడుతూ ఈయన మృతదేహం కనిపించిందని, బహుశా కొన్ని రోజుల క్రితమే ఈయన సూసైడ్ చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నామని పోలీసులు చెప్పారు. అయితే ఇది హత్య అయి ఉండవచ్చునన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నామన్నారు.
ఎయిమ్స్ లోని పీడియాట్రిక్స్ విభాగంలో పని చేస్తున్న ఈ డాక్టర్ హర్యానాలోని పంచ కుల ప్రాంతానికి చెందినవాడని, 2006 నుంచే ఢిల్లీలో ఉంటున్నాడని తెలిసింది. ఇతని డెడ్ బాడీని పోలీసులు పోస్ట్ మార్టం కోసం పంపారు.