Dawood Ibrahim: దావూద్‌కు సోదరుడికి ఝలక్.. పలు ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ..
Dawood Ibrahim: అన్న అండర్‌వరల్డ్ డాన్. ఇక తమ్ముడి దందాలకు అడ్డు ఏముంది? అతను బెదిరించి కొట్టేసిన ఫ్లాట్ కథ బయటకొచ్చింది.
Dawood Ibrahim: అన్న అండర్‌వరల్డ్ డాన్. ఇక తమ్ముడి దందాలకు అడ్డు ఏముంది? అతను బెదిరించి కొట్టేసిన ఫ్లాట్ కథ బయటకొచ్చింది. ఈ దందా వివరాలు ఇలా ఉన్నాయి. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం తమ్ముడు ఇక్బాల్ కస్కర్. దావూద్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా కస్కర్‌ను కొన్నాళ్ల కిందట ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. పలు దోపిడీ కేసుల్లో అప్పటికే కస్కర్ థానే జైలులో ఉన్నాడు. ఇప్పుడు మహారాష్ట్రలోని థానేలో కస్కర్ పేరు మీద ఉన్న 55 లక్షల రూపాయల విలువైన ఫ్లాట్‌ను ఈడీ అటాచ్ చేసింది. దీనికి సంబంధించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ప్రొవిజినల్ ఆర్డర్‌ను జారీ చేశారు.
ఈ ఫ్లాట్ వెనుక పెద్ద కథే ఉందని ఈడీ విచారణలో తేలింది. సురేష్ దేవీచంద్ మెహతా అనే రియల్ ఎస్టేట్ డెవలపర్‌ను కస్కర్, మరికొందరు కలిసి బెదిరించి ఈ ఫ్లాట్‌ను దౌర్జన్యంగా రాయించుకున్నారని ఈడీ వెల్లడించింది. ఈ ఫ్లాట్‌ను ఇక్బాల్ కస్కర్‌కు సన్నిహితంగా ఉండే ముంతాజ్ ఇజాజ్ షేక్ పేరున రాయించారు. అలాగే బిల్డర్ నుంచి కస్కర్ బ్యాచ్ 10 లక్షల రూపాయలకు నాలుగు చెక్‌లు తీసుకున్నారు. వీటిని ఎన్‌క్యాష్ చేసుకున్న అకౌంట్లలో ఇంకెలాంటి లావాదేవీలు జరుపలేదు. ఈడీ తన దర్యాప్తులో తేలిన విషయాల ఆధారంగా కస్కర్‌పై మనీ లాండరింగ్ కేసు పెట్టింది. ఇప్పటికే పలు దోపిడీ కేసుల్లో థానే జైలులో ఉన్నాడు కస్కర్. అతన్ని ఫిబ్రవరిలో ఈడీ కస్టడీలోకి తీసుకుంది. మరోవైపు కొన్నాళ్ల కిందటే దావూద్ ఇబ్రహీం సోదరి, గ్యాంగ్‌స్టర్ చోటా షకీల్ బావమరిది ఇళ్లపై ఈడీ దాడులు చేసింది.
Also read:
Hair Care Tips: వేసవిలో అందమైన, మెరిసే జుట్టు కావాలా?.. అయితే, ఈ చిట్కాలను పాటించండి..!
US President Biden: అమెరికా అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. గన్ కల్చర్‌పై ప్రత్యేక ఫోకస్..
Russia – Ukraine War: ‘అమ్మా స్వర్గంలో కలుస్తా!’.. రష్యా దాడిలో చనిపోయిన తల్లికి 9 ఏళ్ల బాలిక లేఖ..