Cyclone Biparjoy: గుజరాత్‌లో తుఫాన్ తీవ్ర రూపం.. సముద్రం అల్లకల్లోలం.. పలు రైళ్లు రద్దు.. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు..

| Edited By: Surya Kala

Jun 13, 2023 | 1:41 PM

గుజరాత్‌లోని తుఫాన్‌ పరిస్థితిని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీవ ఎప్పటికప్పుడు సమీక్షస్తున్నారు. ఆయన ప్రస్తుతం కచ్‌లోనే ఉన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. రాజధాని గాంధీనగర్‌తో పాటు తీరప్రాంతంలోని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

Cyclone Biparjoy: గుజరాత్‌లో తుఫాన్ తీవ్ర రూపం.. సముద్రం అల్లకల్లోలం.. పలు రైళ్లు రద్దు.. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు..
Cyclone Biporjoy
Follow us on

ఆరేబియా సముద్రంలో దాదాపు పది రోజులుగా అలజడి సృష్టిస్తున్న బిపర్‌జోయ్‌ తుఫాన్ తీవ్రరూపు దాల్చింది. ఇప్పటికే గుజరాత్‌ తీరప్రాంతం, పాకిస్థాన్‌లోని కరాచీలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్నాయి. గాలులు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. మరికొన్ని గంటల్లో గాలుల వేగం 150 కిలోమీటర్లకు చేరుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుజరాత్‌లోని మాండ్వి, పాకిస్థాన్‌లోని కరాచీ మధ్యన ఉన్న జఖావు తీరంలో ఈ తుఫాన్‌ గురువారం మధ్యాహ్నం తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. గుజరాత్‌లో పరిస్థితిని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఉన్నతస్థాయిలో సమీక్షించారు.

గుజరాత్‌లోని తుఫాన్‌ పరిస్థితిని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీవ ఎప్పటికప్పుడు సమీక్షస్తున్నారు. ఆయన ప్రస్తుతం కచ్‌లోనే ఉన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. రాజధాని గాంధీనగర్‌తో పాటు తీరప్రాంతంలోని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తుఫాన్‌ కారణంగా గుజరాత్‌లో సరుకు రవాణా వాహనాల నిలిపివేశారు. అనేక చోట్ల మొబైల్‌ సేవలు నిలిచిపోయాయి. గుజరాత్‌ వైపు వెళ్లే అనేక రైళ్లను పశ్చిమ రైల్వే శాఖ రద్దు చేసింది.

తుఫాన్‌ తీరం దాటే జఖావు రేవు సమీపంలోని మాండ్వీలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో సౌరాష్ట్ర, కచ్ తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రంలోని రిగ్‌లలో పనిచేస్తున్నవారిని సైతం తరలిస్తున్నారు. కోస్ట్ గార్డ్ బలగాలు ALH ధృవ్ హెలీకాప్టర్ల ద్వారా తరలింపుని చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..