Cyclone Biparjoy: దిశ మార్చుకున్న బిపర్‌జాయ్‌ తుపాను.. భారీగా ఎగసిపడుతున్న సముద్ర అలలు..

|

Jun 12, 2023 | 12:03 PM

ప్రస్తుతం ఇది తూర్పు మధ్య అరేబియా సముద్రంలో పోర్‌బందర్‌కు దక్షిణ-నైరుతికి 480 కిలోమీటర్ల దూరంలో, ద్వారకకు దక్షిణ-నైరుతిగా 530 కిలోమీటర్ల దూరంలో, కచ్‌లోని నలియాకు దక్షిణ-నైరుతికి 610 కిలోమీటర్ల దూరంలో, పాకిస్థాన్‌లోని కరాచీకి దక్షిణాన 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

Cyclone Biparjoy: దిశ మార్చుకున్న బిపర్‌జాయ్‌ తుపాను.. భారీగా ఎగసిపడుతున్న సముద్ర అలలు..
Cyclone Biparjoy
Follow us on

ప్రస్తుతం ఇది తూర్పు మధ్య అరేబియా సముద్రంలో పోర్‌బందర్‌కు దక్షిణ-నైరుతికి 480 కిలోమీటర్ల దూరంలో, ద్వారకకు దక్షిణ-నైరుతిగా 530 కిలోమీటర్ల దూరంలో, కచ్‌లోని నలియాకు దక్షిణ-నైరుతికి 610 కిలోమీటర్ల దూరంలో, పాకిస్థాన్‌లోని కరాచీకి దక్షిణాన 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. జూన్ 14 వరకు ఇది ఉత్తరం వైపుగా కదిలే అవకాశం ఉందని, ఆ తర్వాత ఉత్తరం-ఈశాన్యం దిశగా కదులుతూ సౌరాష్ట్ర, కచ్.. దానికి ఆనుకుని ఉన్న మాండ్వీ , కరాచీ మధ్య పాకిస్థాన్ తీరాలను దాటి 15న మధ్యాహ్నం అత్యంత తీవ్ర తుపానుగా మారుతుందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో గంటకు గరిష్ఠంగా 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.

రాయలసీమను తాకిన రుతుపవనాలు..

నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి.. అయితే రుతు పవనాలు రాష్ట్రమంతా విస్తరించే వరకు ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి..అంటే మరో వారం రోజులపాటు పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత, వడగాలులు ఉండనున్నాయి..ఇక ఇవాళ 134 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 220 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది..ఇక నిన్న అనకాపల్లి, కాకినాడ, విజయనగరం జిల్లాలో 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు..విశాఖ జిల్లాలో 44.7, మన్యం, కోనసీమ జిల్లాలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..మరోవైపు పలుచోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..