Cyclone Biparjoy: పశ్చిమ తీరం వైపు దూసుకొస్తున్న ‘బిపార్‌జోయ్‌’ తుపాను.. ఆ రాష్ట్రాలకు అలర్ట్..

|

Jun 10, 2023 | 8:21 PM

బిపార్‌జోయ్‌ తుపాను మరికొన్ని గంటల్లో గుజరాత్‌ తీరాన్ని తాకబోతోంది. గుజరాత్‌తో పాటు కేరళ, కర్నాటక, లక్షద్వీప్‌ లోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముంది. పశ్చిమ తీరం వైపు దూసుకొస్తోంది బిపార్‌జోయ్‌ తీవ్ర తుపాను. ఈ తుపాను ఆదివారం నాటికి ఉధృతం అయ్యే అవకాశముంది. గుజరాత్‌, కేరళ, కర్నాటక, లక్షద్వీప్‌ను, అధికార యంత్రాంగాలను..

Cyclone Biparjoy: పశ్చిమ తీరం వైపు దూసుకొస్తున్న ‘బిపార్‌జోయ్‌’ తుపాను.. ఆ రాష్ట్రాలకు అలర్ట్..
Cyclone Biparjoy
Follow us on

బిపార్‌జోయ్‌ తుపాను మరికొన్ని గంటల్లో గుజరాత్‌ తీరాన్ని తాకబోతోంది. గుజరాత్‌తో పాటు కేరళ, కర్నాటక, లక్షద్వీప్‌ లోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముంది. పశ్చిమ తీరం వైపు దూసుకొస్తోంది బిపార్‌జోయ్‌ తీవ్ర తుపాను. ఈ తుపాను ఆదివారం నాటికి ఉధృతం అయ్యే అవకాశముంది. గుజరాత్‌, కేరళ, కర్నాటక, లక్షద్వీప్‌ను, అధికార యంత్రాంగాలను కేంద్రం అప్రమత్తం చేసింది. మత్స్యకారులు వేటకు దూరంగా ఉండాలని కోస్ట్‌గార్డ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

పోర్‌బందర్‌కు నైరుతి వైపున..

గుజరాత్‌ లోని పోర్‌బందర్‌కు నైరుతి వైపున 640 కిలోమీటర్ల దూరంలో ఈ తుపాను కేంద్రీకృతమై ఉంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్‌డీఆర్ఎఫ్ రెడీ అయింది. తుపాను ప్రభావంతో కర్ణాటక, గోవా, మహరాష్ట్రలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది. భారీ అలల కారణంగా గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం తితాల్‌ బీచ్‌ను ఈ నెల 14 వరకూ మూసివేస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

చేపల వేటకు వెళ్లవద్దు..

తుపాను కారణంగా 55 కిలోనాట్స్‌ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. ఇవి 65 కిలోనాట్స్‌ వరకూ చేరవచ్చని అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాల్లో ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.

ఇవి కూడా చదవండి

కోస్ట్‌గార్డ్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. కోస్ట్‌గార్డ్‌ హెలికాప్టర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లు వెంటనే వెనక్కి రావాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. బిపార్జోయ్ తుఫాను తీవ్రరూపం దాల్చనున్న దృష్ట్యా.. కేరళ, కర్ణాటక, లక్షద్వీప్‌ తీరాలలోని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని కూడా వాతావరణ శాఖ సూచించింది. కేరళలోని తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, కోజికోడ్‌, కన్నూర్‌లలో ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.

మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..