మరింత బలపడిన ఎంఫాన్ తుఫాన్.. డేంజర్ ప్రాంతాలు ఇవే

| Edited By:

May 18, 2020 | 8:19 AM

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ...

మరింత బలపడిన ఎంఫాన్ తుఫాన్.. డేంజర్ ప్రాంతాలు ఇవే
Follow us on

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 20వ తేదీ మధ్యాహ్నం వరకూ హతియా దీవులు, సాగర్ ద్వీపాల మధ్య తుఫాను తీరం దాటనుందని తెలిపింది.

ఈ నేపథ్యంలో మే 19న బెంగాల్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, పలు చోట్ల తేలికపాటి జల్లులు కురవనున్నట్లు పేర్కొన్నారు అధికారులు. ఒడిశాలోని గజపతి, గంజాం, పూరి, జగత్‌సింగ్‌పుర్ తదితర ప్రాంతాల్లో ఎంఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో 100 కిలో మీటర్ల వేగంతో గాలి వీస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇది క్రమ క్రమంగా పెరుగుతుందని.. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని సూచించారు.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఏపీలో ఇది తీరం దాటకపోయినా దీని ప్రభావం మాత్రం కనిపిస్తుందన్నారు. సోమవారం, మంగళవారం కూడా వానలు పడొచ్చంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక తెలంగాణలో కూడా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చంటున్నారు. అయినప్పటికీ వేడి మాత్రం ఎక్కువగానే నమోదు కానుందన్నారు. అయితే ఈ రెండు రాష్ట్రాల కంటే దీని ప్రభావం ఎక్కువగా ఒడిశా, బెంగాల్‌పై ఉందని అక్కడి వారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Read More: 

రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు.. ఈ రోజు తేలనుంది

గుడ్‌న్యూస్.. వారికి 3 నెలలు గ్యాస్ సిలిండర్ ఉచితం