రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు.. ఈ రోజు తేలనుంది

తెలంగాణాలో బస్సులు తిరగనున్నాయా? ప్రజా రవాణాకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బస్సులు నడపాలని తెలంగాణ సర్కార్ చూస్తోందా? అంటే అవుననే సమాచారం..

రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు.. ఈ రోజు తేలనుంది
Follow us

| Edited By:

Updated on: May 18, 2020 | 10:01 AM

తెలంగాణాలో ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయా? ప్రజా రవాణాకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బస్సులు నడపాలని తెలంగాణ సర్కార్ చూస్తోందా? అంటే అవుననే సమాచారం అందుతోంది. ఇప్పటికే దీనిపై ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.

లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటికే ఎక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోయాయి. అందులో ఆర్టీసీ ఒకటి. ఇటీవలే కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. అందులో 50 శాతం వరకూ ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు కూడా ఓకే చెప్పింది. అయితే మరో వైపు సీఎం కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో లాక్‌డౌన్‌‌ను పొడిగించి మరింత కఠినంగా అమలు పరుస్తున్నారు. ఎందుకంటే వైరస్ మరింత విజృంభించే ప్రమాదం లేకపోలేదు. అందుకోసమే కేవలం కొన్నింటికి మాత్రమే సడలింపులు ఇచ్చింది టీఎస్ సర్కార్.

అయితే తెలంగాణలో మంగళవారం నుంచి ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ఏ విషయమన్నది ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జరిగే కేబినెట్ భేటీలో కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే కేవలం రాష్ట్రంలో మాత్రమే ప్రస్తుతానికి బస్సులు నడుపుతారా? లేక అంతర్రాష్ట్ర బస్సులకు కూడా అనుమతి ఇస్తారా అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ప్రస్తుతం వైరస్ కేసులు కూడా తీవ్రంగా నమోదవుతున్నాయి కాబట్టి.. కేవలం ఆరెంజ్, గ్రీన్ జోన్లలోనే బస్సులు నడిపితే బెటర్ అని ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాగా ఈ రోజు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ అధ్యక్షతన ఆర్టీసీ హైలెవల్ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్‌లో బస్సుల నిర్వహణపై కేబినెట్‌లో ప్రస్తావించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Read More: గుడ్‌న్యూస్.. వారికి 3 నెలలు గ్యాస్ సిలిండర్ ఉచితం

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!