Cyber Crime: పిల్లలపై 400 శాతం పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు.. ఎన్‌సీఆర్‌బీ డేటాలో విస్తుగొలిపే విషయాలు..!

Cyber ​​Crime Alert: ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం చిన్నారులపై సైబర్ నేరాలు జరుగుతున్న మొదటి ఐదు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ (170), కర్ణాటక (144), మహారాష్ట్ర (137), కేరళ (107), ఒడిశా (71) ఉన్నాయి.

Cyber Crime: పిల్లలపై  400 శాతం పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు.. ఎన్‌సీఆర్‌బీ డేటాలో విస్తుగొలిపే విషయాలు..!
Cyber Crime
Follow us

|

Updated on: Nov 14, 2021 | 4:05 PM

National Crime Records Bureau: 2019తో పోల్చితే 2020లో పిల్లలపై సైబర్ నేరాలు 400 శాతానికి పైగా నమోదయ్యాయి. వీటిలో ఎక్కువ భాగం పిల్లలను లైంగిక చర్యలలో చిత్రీకరించే మెటీరియల్‌ని ప్రచురించడం లేదా ప్రసారం చేయడం ద్వారా ఉత్పన్నమైనవే కావడం విస్తుపోయేలా చేస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ( నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తరపున తాజా డేటాను విడుదల చేసింది) మీడియా నివేదికలు ఈ మేరకు వెల్లడిస్తున్నాయి.

ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం చిన్నారులపై సైబర్ నేరాలు జరుగుతున్న మొదటి ఐదు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ (170), కర్ణాటక (144), మహారాష్ట్ర (137), కేరళ (107), ఒడిశా (71) ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం, 2020 సంవత్సరంలో పిల్లలపై ఆన్‌లైన్ నేరాలకు సంబంధించి మొత్తం 842 కేసులు నమోదయ్యాయి. వాటిలో 738 కేసులు లైంగిక చర్యలలో పిల్లలను చిత్రీకరించే విషయాలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం వంటివి అందులో ఉన్నాయి.

2019లో 164 కేసులు.. 2019తో పోల్చితే 2020కి సంబంధించిన ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం పిల్లలపై సైబర్ నేరాలు (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద నమోదయ్యాయి) 400 శాతానికి పైగా పెరిగాయి. దీని ప్రకారం 2019లో పిల్లలపై సైబర్ నేరాలకు సంబంధించి 164 కేసులు నమోదు కాగా, 2018లో చిన్నారులపై 117 సైబర్ నేరాలు నమోదయ్యాయి. గతంలో 2017లో 79 కేసులు నమోదయ్యాయి.

‘క్రై-చైల్డ్ రైట్స్ అండ్ యూ’ అనే స్వచ్ఛంద సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పూజా మార్వా మాట్లాడుతూ, పిల్లలు చదువుPreview (opens in a new tab) కోసం, ఇతర కమ్యూనికేషన్ ప్రయోజనాలను పొందడానికి ఇంటర్నెట్‌లో ఎక్కువ సమయం గడుపుతూ అనేక రకాల నష్టాలను ఎదుర్కొంటున్నారు. పిల్లలు ముఖ్యంగా ఆన్‌లైన్ లైంగిక వేధింపులు, అశ్లీల సందేశాల మార్పిడి, అశ్లీలతకు గురికావడం, లైంగిక వేధింపుల మెటీరియల్, సైబర్-బెదిరింపు, ఆన్‌లైన్ వేధింపులకు గురవుతున్నారు. అయితే ఇవన్నీ ఇంటర్నెట్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నందుకే జరుగుతున్నాయని ఆయన అంటున్నారు.

ఆన్‌లైన్ దుర్వినియోగం, పిల్లల దోపిడీ, పాఠశాలల మూసివేతతో ఇంటర్నెట్‌లో పిల్లలపై ఎక్కువగా ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. COVID-19 మహమ్మారిని అరికట్టడానికి తీసుకున్న చర్యల ప్రభావాన్ని నిర్ధారించడానికి చాలా తక్కువ ఆధారాలు ఉన్నప్పటికీ, ఇది తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని ఆయన అన్నారు. ఇంటర్నెట్‌లో ఎక్కువ సమయం వెచ్చిస్తున్నందువల్లే ఇలాంటివి జరుగున్నాయి. వీటిన నుంచి త్వరగా బయటపడకపోతే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆయన తెలిపారు.

Also Read: Kerala Heavy Rains: కేరళకు రెడ్ అలెర్ట్… 48 గంటల పాటు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

Nirmala Sitharaman: రేపు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులతో కేంద్ర మంత్రి సీతారామన్‌ సమావేశం.. కీలక అంశాలపై చర్చ