Hardeep Puri: మద్యంపై పన్ను తగ్గించడం కాదు.. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించండి..
పెట్రోల్(petrol, diesel), డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించకుండా రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్(Hardeep Puri) పూరీ తీవ్రంగా మండిపడ్డారు...
పెట్రోల్(petrol, diesel), డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించకుండా రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్(Hardeep Puri) పూరీ తీవ్రంగా మండిపడ్డారు. పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి అయిన పూరీ.. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఇంధనంపై పన్నులను తగ్గిస్తే పెట్రోల్ చౌకగా ఉంటుందని అన్నారు. గతేడాది నవంబర్‌లో దిగుమతి చేసుకున్న మద్యంపై 50% వరకు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల కంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై తక్కువ వ్యాట్ విధిస్తున్నాయని చెప్పారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ లీటర్‌కు రూ.14.50 నుంచి రూ.17.50 వరకు ఉండగా, ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో లీటరుకు రూ.26 నుంచి రూ.32 వరకు ఉన్నాయని ఆయన చెప్పారు. “వారి ఉద్దేశం, విమర్శించడం మాత్రమే, ప్రజలకు ఉపశమనం కలిగించదు” అని ఆయన అన్నారు. మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ.32.15 పన్నులు వసూలు చేస్తోందని అన్నారు. మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌లో ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ.29.10 పన్నులు వసూలు చేస్తోందని పేర్కొన్నారు.
‘ఇంధనంపై వ్యాట్ హర్యానాలో అత్యల్పంగా ఉంది’
బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో కేవలం రూ. 14.51, ఉత్తరప్రదేశ్‌లో రూ. 16.50 మాత్రమే విధిస్తున్నారని చెప్పారు. హర్యానాలో పెట్రోల్‌పై 18 శాతం, డీజిల్‌పై 16 శాతం వ్యాట్‌ను వసూలు చేస్తున్నారు. ఇది అత్యల్పంగా ఉంది. “మహారాష్ట్ర ప్రభుత్వం 2018 నుంచి ఇంధన పన్నుల రూపంలో రూ. 79,412 కోట్లు వసూలు చేసింది. ఈ సంవత్సరం 33,000 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేసింది. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్ & డీజిల్‌పై వ్యాట్‌ని ఎందుకు తగ్గంచడం లేదు?” అని అడిగారు.
రాష్ట్రాలకు ప్రధాని మోదీ విన్నపం
బుధవారం, ముఖ్యమంత్రులతో కోవిడ్ సమీక్షా సమావేశంలో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో అధిక ఇంధన ధరల అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ లేవనెత్తారు. కేంద్రం గత నవంబర్‌లో ఇంధనంపై వ్యాట్‌ను తగ్గించిందని, అయితే కొన్ని రాష్ట్రాలు ‘కొన్ని కారణాల వల్ల అలా చేయలేదు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, జార్ఖండ్ ప్రజలకు ఉపశమనం కలిగించడానికి పన్నులను తగ్గించాలని ఆయన అభ్యర్థించారు.
Read Also.. HIV Victims: కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో దేశంలో పెరిగిన HIV కేసులు.. RTI నివేదికతో వెలుగులోకి సంచలనాలు!