మాయావతిని బీజేపీ రాష్ట్రపతి చేస్తుందా..? అఖిలేష్ వ్యాఖ్యలపై స్పందించిన బీఎస్పీ చీఫ్
ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్(President Ram Nath Kovind) పదవీకాలం ఈ ఏడాది జులై మాసంతో ముగియనుంది. రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని అధికార బీజేపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.
ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్(President Ram Nath Kovind) పదవీకాలం ఈ ఏడాది జులై మాసంతో ముగియనుంది. రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని అధికార బీజేపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. దీనికి సంబంధించి విపక్ష నేతలతో సంప్రదింపులు ఇప్పటి నుంచే మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్డీయే తరఫు రాష్ట్రపతి అభ్యర్థికి పోటీగా తమ అభ్యర్థిని బరిలో నిలపాలని కాంగ్రెస్, ఇతర విపక్షాలు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కాకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. గులాం నబీ ఆజాద్, నితీష్ కుమార్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు తదుపరి రాష్ట్రపతి రేసులో ఉన్నట్లు ఇప్పటికే ప్రచారం జరిగింది. తాజాగా బహుజన్ సమాజ్‌వాది పార్టీ(BSP) చీఫ్ మాయావతి (Mayawati) కూడా రాష్ట్రపతి పదవిని ఆశిస్తున్నారన్న ప్రచారం తెర మీదకు వచ్చింది. ఈ ఊహాగానాలకు యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ(SP) అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) ఆజ్యం పోశారు. మాయావతి రాష్ట్రపతి కావాలని ఆశిస్తున్నట్లు అఖిలేష్ వెల్లడించారు. మొన్నటి ఎన్నికల్లో బీఎస్పీ ఓట్లు బీజేపీకి పడేలా మాయావతి చూశారని.. దీనికి ప్రతిఫలంగా మాయావతిని బీజేపీ రాష్ట్రపతిని చేస్తుందేమో వేచి చూడాలని మెయిన్‌పురిలో బుధవారంనాడు అఖిలేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై దేశ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలయ్యింది.
అయితే అఖిలేష్ వ్యాఖ్యలను తోసిపుచ్చిన మాయావతి.. తాను రాష్ట్రపతి పదవిని ఆశిస్తున్నట్లు అఖిలేష్ పుకార్లను సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు. తాను రాష్ట్రపతి పదవిని ఎప్పుడూ ఆశించలేదని చెప్పుకొచ్చారు. యూపీలో మళ్లీ సీఎం అయ్యేందుకు తన అడ్డు తొలగించుకోవాలని అఖిలేష్ యాదవ్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తాను ఆశిస్తున్నట్లు ఆమె స్పష్టంచేశారు. అలాగే అట్టడుగు వర్గాల ప్రజల కోసం తన లక్ష్యాలను నెరవేర్చేందుకు దేశ ప్రధాని కావాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి లేదా ప్రధాన మంత్రి కావాలనే తాను కలలు కంటాను తప్ప రాష్ట్రపతి పదవి కోసం కాదని కుండబద్ధలు కొట్టారు.
డాక్టర్ బీఆర్ అంబేదర్కర్, కాన్షీరాం చూపిన దారిలో తాను అట్టడుగు వర్గాల శ్రేయస్సే తన లక్ష్యమని మాయవతి స్పష్టంచేశారు. తన లక్ష్యం యూపీకి మళ్లీ ముఖ్యమంత్రి కావాడం లేదా దేశ ప్రధాని కావడం ద్వారా సాధ్యం తప్ప.. రాష్ట్రపతి పదవితో సాధ్యంకాదన్నారు. తనను రాష్ట్రపతికి పంపడం ద్వారా సీఎం పదవికి అడ్డు తొలగించుకోవాలని అఖిలేష్ యాదవ్ కలలు కంటున్నారని.. అది సాధ్యంకాదన్నారు.
మరిన్ని జాతీయ వార్తలను ఇక్కడ చదవండి..
Also Read..
Hardeep Puri: మద్యంపై పన్ను తగ్గించడం కాదు.. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించండి..