AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెనడా కేంద్రంగా భారత్‌పై ఖలిస్థానీ ఉగ్రవాదుల కుట్రలు! CSIS సంచలన రిపోర్ట్‌

కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (CSIS) తాజా నివేదికలో కెనడాలోని ఖలిస్తానీ తీవ్రవాదులు భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలు, నిధుల సేకరణ, ప్రణాళికలు రచిస్తున్నారని వెల్లడించింది. ఇది భారతదేశం ఎప్పటినుంచో లేవనెత్తుతున్న ఆందోళనలను ధృవీకరిస్తుంది. కెనడా ప్రభుత్వం "ఉగ్రవాదం" అనే పదాన్ని అధికారికంగా ఉపయోగించడం ఇదే మొదటిసారి.

కెనడా కేంద్రంగా భారత్‌పై ఖలిస్థానీ ఉగ్రవాదుల కుట్రలు! CSIS సంచలన రిపోర్ట్‌
Pm Modi And Canada Pm
SN Pasha
|

Updated on: Jun 19, 2025 | 1:28 PM

Share

కెనడా ప్రధాన నిఘా సంస్థ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (CSIS) సంచలన సమాచారం బయటపెట్టింది. ఖలిస్తానీ తీవ్రవాదులు ప్రధానంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, నిధుల సేకరణకు, ప్రణాళిక వేయడానికి కెనడాను స్థావరంగా ఉపయోగిస్తున్నారని మొదటిసారి అధికారికంగా ధృవీకరించింది. బుధవారం CSIS విడుదల చేసిన తన వార్షిక నివేదికలో కెనడా జాతీయ భద్రతకు కొన్ని కీలక ఆందోళనలు, ముప్పులను వివరించింది.

ఖలిస్తానీలకు సంబంధించి కెనడా అధికారికంగా “ఉగ్రవాదం” అనే పదాన్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి. భారత వ్యతిరేక శక్తులకు కెనడా సురక్షితమైన స్వర్గధామంగా మారిందని CSIS ధృవీకరించింది. భారతదేశం చాలా కాలంగా లేవనెత్తుతున్న ఆందోళనలను ఇది ధృవీకరిస్తోంది. కెనడా గడ్డ నుండి పనిచేస్తున్న ఖలిస్తానీ తీవ్రవాదుల గురించి భారతదేశం సంవత్సరాలుగా ఆందోళనలు లేవనెత్తుతోంది, కానీ కెనడా ఈ సమస్యను పెద్దగా పట్టించుకోలేదు.

CSIS నివేదిక ఏం చెబుతోంది?

1980ల మధ్యకాలం నుండి, కెనడాలో రాజకీయ ప్రేరేపిత హింసాత్మక తీవ్రవాదం (PMVE) ముప్పు ప్రధానంగా కెనడాకు చెందిన ఖలిస్తానీ తీవ్రవాదుల (CBKEs) ద్వారా వ్యక్తమవుతోందని నివేదిక పేర్కొంది. కెనడాకు చెందిన ఖలిస్తానీ తీవ్రవాదులు (CBKEలు) భారతదేశంలోని పంజాబ్‌లోనే ఖలిస్తాన్ అనే స్వతంత్ర దేశాన్ని సృష్టించడానికి హింసాత్మక మార్గాలను ఉపయోగించాలని, మద్దతు ఇస్తూ ప్రణాళికలు రచిస్తున్నారని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా, కెనడా నుండి ఉద్భవిస్తున్న ఖలిస్తానీ తీవ్రవాదం భారత విదేశీ జోక్య కార్యకలాపాలను నడిపిస్తూనే ఉంది అని నివేదిక హెచ్చరించింది. ఈ తాజా వార్షిక నివేదికతో కెనడాలో విదేశీ జోక్యం, ఉగ్రవాద కార్యకలాపాల గురించి ఆందోళనలను రేకెత్తించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఇటీవలె భేటీ అయిన విషయం తెలిసిందే. జీ7 సదస్సులో భాగంగా కెనడాకు వెళ్లిన ప్రధాని మోదీ.. కెనడా నూతన ప్రధాని కార్నీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఇరు దేశాల దౌత్యసంబంధాలపై చర్చించారు. ఒకరి రాజధానులకు ఒకరు హైకమిషనర్లను పునరుద్ధరించాలని నిర్ణయించారు. 2023లో కెనడాలో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతదేశ ప్రమేయం ఉందని కెనడా మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటించడంతో భారత్‌, కెనడా మధ్య ఉద్రిక్తతలు పెరిగి, దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా మోదీ కెనడా పర్యటనతో ఇరు దేశాల మధ్య మళ్లీ స్నేహం కుదిరింది. అయితే.. ప్రధాని మోదీ పర్యటన తర్వాత ఈ నివేదిక కావడం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి