Tamil Nadu: కొవిడ్ నిబంధనలకు తూట్లు.. తమిళనాడులో కిక్కిరిసిన షాపులు.. ఆషాఢమాస వేళ వస్త్రదుకాణాల్లో ఫుల్ రష్

తమిళనాడులో కొవిడ్ లాక్ డౌన్.. అన్ లాక్ మొదలైన వేళ జనం షాపులకు క్యూకట్టారు. చెన్నైలో ఒక బట్టల షాపులో ఇవాళ కొనడానికి వచ్చిన జనం చూస్తే ముక్కున వ్రేలేసుకోవాల్సిన..

Tamil Nadu: కొవిడ్ నిబంధనలకు తూట్లు.. తమిళనాడులో కిక్కిరిసిన షాపులు.. ఆషాఢమాస వేళ వస్త్రదుకాణాల్లో ఫుల్ రష్
Tamilnadu Shoping

Edited By:

Updated on: Jul 11, 2021 | 10:14 PM

Shops Rush: తమిళనాడులో కొవిడ్ లాక్ డౌన్.. అన్ లాక్ మొదలైన వేళ జనం షాపులకు క్యూకట్టారు. చెన్నైలో ఒక బట్టల షాపులో ఇవాళ కొనడానికి వచ్చిన జనం చూస్తే ముక్కున వ్రేలేసుకోవాల్సిన పరిస్థితి. మనిషికి మనిషికి మధ్య కనీసం రెండు అడుగుల దూరం కూడా లేకుండా కిక్కిరిసిపోయి ఉన్నారు జనాలు.

తమిళనాడులో కరోనా ఆంక్షలు ఎత్తేయడంతో జనాలు భారీ సంఖ్యలో బయటకు వస్తున్నారు. అటు, వైన్ షాపులకు మందుబాబులు పొటెత్తారు. ఒక్కసారిగా మద్యం కోసం ఎగబడుతూ కొవిడ్ నిబంధనలు మరిచిపోయారు.

కాటన్లకు కాటన్లు పట్టుకు వెళ్తున్నారు. పది రోజులకు సరిపడా మందు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుంటే మరో వైపు మందుబాబులు మాత్రం భౌతిక దూరం గాలికి వదిలేశారు.

అటు, కిరాణా షాపులు, కూరగాయల మార్కెట్​లు కూడా జనాలతో కిటకిటలాడాయి. సొంత గ్రామాలకు చేరుకునేందుకు వస్తున్న జనాలతో బస్టాండ్లు కిక్కిరిపోయాయి.

Read also: Jagan government: గంటల వ్యవధిలో రెండు సిఐడి కేసులకు ఆదేశించిన జగన్ సర్కారు