India Corona: దేశంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. భారీగా పెరిగిన మరణాలు.. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

|

Jul 09, 2022 | 11:58 AM

Covid19 Updates: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గత మూడు రోజులుగా 18 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. పెరుగుతున్న కేసుల కారణంగా పాజిటివిటీ రేటు 4 శాతాన్ని దాటిపోయింది. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

India Corona: దేశంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. భారీగా పెరిగిన మరణాలు.. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
India Corona
Follow us on

Covid19 Updates: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గత మూడు రోజులుగా 18 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. పెరుగుతున్న కేసుల కారణంగా పాజిటివిటీ రేటు 4 శాతాన్ని దాటిపోయింది. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. శుక్రవారం 4.54 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,840 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటివరకూ 4.36 కోట్ల మంది ఈ మహమమ్మారి బారిన పడ్డారు. పాజిటివిటీ రేటు 4.14 శాతానికి చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో 43 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. గత కొన్ని రోజుల నుంచి పోల్చుకుంటే నిన్న మరణాల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఇప్పటివరకు 5.25 లక్షల మంది కొవిడ్‌ కారణంగా చనిపోయారు.

ప్రస్తుతం దేశంలో 1, 25, 028 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. క్రియాశీల కేసుల రేటు 0.29 శాతానికి పెరిగింది. ఇక నిన్న 16 వేల మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.51 శాతానికి పడిపోయింది. ఇక కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. నిన్న సుమారు12 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం198 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశామని కేంద్రం వెల్లడించింది. దేశ జనాభాలో 90 శాతం మంది వయోజనులకు పూర్తిస్థాయి టీకా అందినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రపంచదేశాల్లో కూడా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 7,91,063 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,463 మంది మహమ్మారితో ప్రాణాలు విడిచారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..