Telugu News India News Covid19 Updates India reports 16,159 Covid19 cases and 28 deaths in last 24 hours
India Corona: దేశంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. మళ్లీ భారీగా పెరిగిన కేసులు.. నిన్న ఎంతమంది చనిపోయారంటే..
Covid 19 Updates: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో గడచిన 24 గంటల్లో (మంగళవారం) కొత్తగా 16,159 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
Covid19 Updates: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో గడచిన 24 గంటల్లో (మంగళవారం) కొత్తగా 16,159 కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిన్న మొత్తం 4,54,465 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఈ కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సోమవారంతో పోలిస్తే 3వేలకు పైగా కేసులు పెరగడం దేశంలో కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక తాజాగా మరో 28 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,15,212గా ఉండగా, మొత్తం కేసుల్లో ఇది 0.26 శాతమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. డైలీ పాజిటివిటీ రేటు 3.56 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 3.84 శాతంగా నమోదైంది.
కాగా గడిచిన 24 గంటల్లో 15, 394 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. రికవరీ రేటు 98.53 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కేసుల్లో మహారాష్ట్రదే అగ్రస్థానం. మంగళవారం మొత్తం 3,098 కేసులు నమోదుకాగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఇక ఢిల్లీలో 615 కొత్త కేసులు రికార్డయ్యాయి. ఇక కరోనా కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. ఇప్పటివరకు 198.20 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.