COVID-19 Vaccine: ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా..? కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పిందంటే..

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన తర్వాత.. భారతదేశంలో ఆకస్మిక గుండెపోటు కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఈ మరణాలకు కరోనా వ్యాక్సిన్ ప్రధాన కారణమని ప్రజల్లో అపోహ నెలకొంది.. కోవిడ్ వ్యాక్సిన్ గురించి ప్రచురించిన కొన్ని అధ్యయనాలతో ప్రజలు గుండె పోటు మరణాలకు అదే కారణమని భావిస్తున్నారు..

COVID-19 Vaccine: ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా..? కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పిందంటే..
Covid 19 Vaccine
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 11, 2024 | 4:19 PM

కోవిడ్19 మహమ్మారి రెండేళ్ల పాటు విలయతాండవం చేసింది.. కోట్లాది మంది ఈ వైరస్ బారిన పడగా.. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన తర్వాత.. భారతదేశంలో ఆకస్మిక గుండెపోటు కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఈ మరణాలకు కరోనా వ్యాక్సిన్ ప్రధాన కారణమని ప్రజల్లో అపోహ నెలకొంది.. కోవిడ్ వ్యాక్సిన్ గురించి ప్రచురించిన కొన్ని అధ్యయనాలతో ప్రజలు గుండె పోటు మరణాలకు అదే కారణమని భావిస్తున్నారు.. అయితే, దేశంలో గుండెపోటు కారణంగా ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రధాన కారణం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో దీనిపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వివరణ ఇచ్చారు.. ఆకస్మిక మరణాలకు కరోనా వ్యాక్సిన్ కారణం కాదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఇందుకోసం భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పరిశోధనలను కూడా ఆరోగ్య మంత్రి రాజ్యసభలో సమర్పించారు.

ఆకస్మిక మరణాలకు ICMR ఏం చెప్పిందంటే..

దేశంలో గుండెపోటు కారణంగా ఆకస్మిక మరణాలకు కరోనా వ్యాక్సిన్ కారణం కాదని ICMR పరిశోధనలో పేర్కొంది. ఇలాంటి మరణాలకు 5 అంశాలు కారణమని నివేదికలో పేర్కొన్నారు. ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యవంతమైన వ్యక్తులపై ఒక అధ్యయనం నిర్వహించింది.

ఈ పరిశోధన 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 47 ఆసుపత్రులలో నిర్వహించింది. ICMR పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న.. ఎటువంటి వ్యాధి లేని వ్యక్తులను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదికను తయారు చేసింది. దీనిలో అక్టోబర్ 1, 2021 – మార్చి 31, 2023 మధ్య తెలియని కారణాల వల్ల కొందరు హఠాత్తుగా మరణించినట్లు తెలిపింది. ఈ విశ్లేషణలో మొత్తం 729 ఆకస్మిక మరణాలు గురించి వివరించింది.

కరోనా వ్యాక్సిన్ మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది..

కరోనా వ్యాక్సిన్‌తో దేశంలోని యువత, పెద్దలలో ఆకస్మిక మరణాల ప్రమాదం పెరగదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అధ్యయనం ద్వారా స్పష్టమైందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పార్లమెంటుకు తెలిపారు. కరోనా వ్యాక్సిన్ అటువంటి మరణాల సంభావ్యతను తగ్గిస్తుందని ఈ అధ్యయనం చూపిస్తుంది.

గత కొన్నేళ్లుగా దేశంలో ఆకస్మిక మరణాలకు కరోనా వ్యాక్సిన్ కారణమనే భయాందోళనలను దృష్టిలో ఉంచుకుని ICMR ఈ పరిశోధనను నిర్వహించింది. ICMR తన పరిశోధనలో 19 రాష్ట్రాలు – కేంద్రపాలిత ప్రాంతాలలో 47 ఆసుపత్రులలో ఈ పరిశోధనను నిర్వహించింది..

పరిశోధన సమయంలో.. ICMR అకస్మాత్తుగా మరణించిన 729 కేసులను శాంపిల్స్‌గా తీసుకుంది.. అయితే మొత్తంగా 2916 నమూనాలు తీసుకోన్నారు.. కొందరు గుండెపోటు వచ్చిన తర్వాత బతికి ఉన్నట్లు తెలిపారు. ఒకటి లేదా రెండు డోస్‌ల కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎటువంటి కారణం లేకుండా ఆకస్మిక మరణం సంభవించే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని పరిశోధనలో వెల్లడైంది.

క‌రోనా వ్యాక్సినేష‌న్ దుష్ప్రభావాలను గుర్తించేందుకు అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ (ఏఈఎఫ్‌ఐ) పేరుతో ఒక నిఘా వ్యవస్థను కూడా రూపొందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా తెలిపారు. టీకా కేంద్రాలలో అనాఫిలాక్సిస్ కిట్‌లు అందుబాటులో ఉంచామన్నారు.. టీకా వేసిన తర్వాత, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 30 నిమిషాల పాటు పరిశీలనలో ఉంచబడతారని వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెళ్లిలో వరుడు చేసిన పనికి వధువు షాక్.. బాత్రూమ్ కు అని చెప్పి.!
పెళ్లిలో వరుడు చేసిన పనికి వధువు షాక్.. బాత్రూమ్ కు అని చెప్పి.!
డబ్బులు కాసే చెట్టును చూశారా? ఇదే అది.! ఆ సాగుపై అవగాహన..
డబ్బులు కాసే చెట్టును చూశారా? ఇదే అది.! ఆ సాగుపై అవగాహన..
కోతికి అంత్యక్రియలు..పెద్ద సంఖ్యలో పాల్గొన్న వానరాలు.!
కోతికి అంత్యక్రియలు..పెద్ద సంఖ్యలో పాల్గొన్న వానరాలు.!
బిర్యానీ సగం తిన్నాక.. అందులో ఉన్నది చూసి షాక్.! వీడియో వైరల్..
బిర్యానీ సగం తిన్నాక.. అందులో ఉన్నది చూసి షాక్.! వీడియో వైరల్..
ఏ పెట్రోల్‌ బంక్‌లోనైనా ఈ సేవలు ఫ్రీ.! ఎవరికీ తెలియని విషయాలు..
ఏ పెట్రోల్‌ బంక్‌లోనైనా ఈ సేవలు ఫ్రీ.! ఎవరికీ తెలియని విషయాలు..
కాఫీ.. మీ ఆయుష్షును ఎలా పెంచుతుందో తెలుసా.?
కాఫీ.. మీ ఆయుష్షును ఎలా పెంచుతుందో తెలుసా.?
మోస్ట్ స్టైలిష్‌ పీపుల్‌ లిస్టులో అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌.!
మోస్ట్ స్టైలిష్‌ పీపుల్‌ లిస్టులో అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌.!
రూ.922కోట్ల కలెక్షన్స్‌ ప్రపంచమంతా దిమ్మతిరిగే రెస్పాన్స్‌..
రూ.922కోట్ల కలెక్షన్స్‌ ప్రపంచమంతా దిమ్మతిరిగే రెస్పాన్స్‌..
ఒంటికి టవల్ చుట్టుకుని మెట్రోరైలు ఎక్కిన యువతులు.! వీడియో వైరల్..
ఒంటికి టవల్ చుట్టుకుని మెట్రోరైలు ఎక్కిన యువతులు.! వీడియో వైరల్..
బీరకాయా.. అని తీసిపారేయకండి.! అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు..
బీరకాయా.. అని తీసిపారేయకండి.! అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు..