AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కొత్త వేరియంట్ అంత భయానకమా..? తెలుగు రాష్ట్రాల్లో తొలి కేసు నమోదు!

కరోనా కొత్త వేరియంట్ నిజంగానే అంత భయానకమా..? మళ్లీ క్వారెంటైన్ కష్టాలు తప్పవా..? పరిస్థితి లాక్‌డౌన్‌కు దారితీస్తుందా? అనే భయాల కంటే ముందుగా గుర్తొచ్చేది కొవిడ్ బూస్టర్ వ్యాక్సిన్. కానీ.. బూస్టర్ వెయ్యించుకోవాలా వద్దా అనేది కూడా ఇప్పుడు ప్రపంచ సమస్యగా మారింది. ఔను.. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌తో గుండెపోటు వచ్చే ఛాన్సుందట.

కరోనా కొత్త వేరియంట్ అంత భయానకమా..? తెలుగు రాష్ట్రాల్లో తొలి కేసు నమోదు!
Corona
Balaraju Goud
|

Updated on: May 23, 2025 | 8:22 AM

Share

కరోనా కొత్త వేరియంట్ నిజంగానే అంత భయానకమా..? మళ్లీ క్వారెంటైన్ కష్టాలు తప్పవా..? పరిస్థితి లాక్‌డౌన్‌కు దారితీస్తుందా? అనే భయాల కంటే ముందుగా గుర్తొచ్చేది కొవిడ్ బూస్టర్ వ్యాక్సిన్. కానీ.. బూస్టర్ వెయ్యించుకోవాలా వద్దా అనేది కూడా ఇప్పుడు ప్రపంచ సమస్యగా మారింది. ఔను.. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌తో గుండెపోటు వచ్చే ఛాన్సుందట.

ఐదేళ్ల కిందట ప్రపంచాన్ని కుదిపేసిన పీడకల కొవిడ్-19.. నేను బతికే ఉన్నా అంటూ అడపాదడపా హెచ్చరిస్తూనే ఉంది. వారం రోజులుగా ఆసియన్ కంట్రీస్‌లో టెర్రర్ పుట్టిస్తోంది. మనదాకా రాలేదుగా అనుకుంటుండగానే భారత్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతూ.. కొవిడ్ భయాన్ని మళ్లీ పరిచయం చేస్తోంది.

ప్రస్తుతం మన దేశంలో 250కి పైగా యాక్టివ్ కేసులున్నాయి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గతంలోలాగే ఈ సీజన్‌లో కూడా కొవిడ్ ఫియర్‌లో కేరళ రాష్ట్రమే ముందుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఎటువంటి పరిస్థితికైనా సిద్ధమవ్వాలని అని స్వయానా కేరళ ఆరోగ్య మంత్రే హెచ్చరించారు. పాండిచ్చేరి, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, సిక్కిం, హర్యానా, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు సైతం అటెన్షన్‌ మోడ్‌లోకి వచ్చేశాయి.

తెలుగురాష్ట్రాల్ని కూడా ఎలర్ట్ చేసింది కొవిడ్ ఫియర్. పొరుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరగడంతో స్పెషల్ అడ్వైజరీ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ. వీలైనంతవరకు పార్టీలు, ఫంక్షన్లు, ప్రార్థనలకు దూరంగా ఉండాలి. రైల్వే స్టేషన్, బస్‌ స్టాండ్, ఎయిర్‌పోర్ట్‌ల్లో మాస్క్ వేసుకోవడం భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. 60 ఏళ్లు పైబడిన వాళ్లు, గర్భవతులు ఇంట్లోంచి బైటికి రావద్దు. తరచూ చేతులు కడుక్కోవాలి, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అనారోగ్యంగా ఉంటే బైటకు వెళ్లకండి.. అని సూచించింది ఏపీ హెల్త్ డిపార్ట్‌మెంట్. పరీక్షల కోసం ల్యాబ్స్ సిద్ధంగా ఉంచాలని జిల్లా వైద్యాధికారుల్ని అప్రమత్తం చేసింది కూడా.

ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్ర కోవిడ్ సంబంధిత సమస్యలతో ఇద్దరు మరణించారు. వీళ్లకు మిగతా అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో అప్పట్లో తేలిగ్గా తీసుకున్నాయి ప్రభుత్వాలు. ఇప్పుడు కూడా మిగతా ఆసియా దేశాలతో పోలిస్తే భారత్‌లో ఆందోళన పడాల్సిన పనే లేదు. ఎందుకంటే.. ఒక్క హాంకాంగ్‌లోనే 30మందికి పైగా చనిపోయారు. థాయ్‌లాండ్‌లో ఏప్రిల్ నుంచే కొవిడ్ టెర్రర్ ఉంది. ఒక్క బ్యాంకాక్‌లోనే ఆరువేల కేసులు నమోదయ్యాయి. మన దేశపు జనాభాతో పోలిస్తే ప్రస్తుతమున్న కేసుల సంఖ్య చాలా తక్కువ. అంతమాత్రాన కరోనా ఉనికి లేదని ఊపిరి పీల్చుకోడానికి లేదు. ఎందుకంటే.. టెస్టుల సంఖ్యను బట్టే కేసుల సంఖ్య ఆధారపడి ఉంటుంది. కొవిడ్ సంకేతాలు కనిపించగానే టెస్టుల కోసం క్యూ కట్టే పరిస్థితి ఇంకా మన దేశంలో లేదు.

ఇప్పుడు సర్క్యులేషన్‌లో ఉన్న వైరస్‌.. ఒమిక్రాన్‌ ఫ్యామిలీలోని జేఎన్‌1 అనే వేరియంట్‌ నుంచి వచ్చిన సబ్‌వేరియంట్. ఒరిజినల్ వైరస్‌తో పోలిస్తే, దీని తీవ్రత చాలాచాలా తక్కువ. థర్డ్‌ వేవ్‌లో వచ్చిన ఒమిక్రాన్‌ వేరియంటే అప్పట్లో పెద్దగా ప్రభావం చూపలేదు. తాజా వేరియంట్‌తో పెద్దగా భయపడాల్సిన అవసరం లేనట్టే..! 100 మందికి వైరస్ సోకితే ఐదుగురు కూడా ఆస్పత్రిలో చేరే అవసరం రాదు. కానీ.. కొవిడ్ ఉనికి తీవ్రతను బట్టి దేశాలన్నీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నదీ ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్‌లైన్. అందుబాటులో ఉన్నంత మాత్రాన బూస్టర్ వ్యాక్సిన్ వేసుకోవచ్చా..? అనేది కొత్తగా పుట్టిన భయం.

ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA.. కొవిడ్ వ్యాక్సిన్ రెగ్యులేషన్స్‌ని మార్చేసింది. 65 ఏళ్లు పైబడినవాళ్లు మాత్రమే బూస్టర్ షాట్స్ తీసుకోడానికి అర్హులని తేల్చింది. ఇంతకంటే భయపెట్టే విషయం ఏంటంటే.. వ్యాక్సినేషన్ తర్వాత గుండెసంబంధిత వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తోంది FDA. ఈ మేరకు లేబుల్ మీద వార్నింగ్ ఇవ్వాలని వ్యాక్సిన్ తయారీ కంపెనీలను ఆదేశించింది కూడా. సో.. బూస్టర్ వ్యాక్సిన్ వేసుకుందాం.. కొవిడ్ బారిన పడకుండా తప్పించుకుందాం అని ఆశపడితే గుండెపోటుకు దొరికిపొయే ఛాన్సు ఉంది. తస్మాత్ జాగ్రత్త..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడిదారులకు గుడ్‌న్యూస్‌!
స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడిదారులకు గుడ్‌న్యూస్‌!
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు..
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు..
విరాట్ కోహ్లీ సడన్ డెసిషన్..అమ్మకానికి రూ.100కోట్ల విలువైన కంపెనీ
విరాట్ కోహ్లీ సడన్ డెసిషన్..అమ్మకానికి రూ.100కోట్ల విలువైన కంపెనీ
మీ నుదటి ఆకారాన్ని బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.
మీ నుదటి ఆకారాన్ని బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.
రీ ఎంట్రీతో క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేయనున్న హార్దిక్ పాండ్యా
రీ ఎంట్రీతో క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేయనున్న హార్దిక్ పాండ్యా
ఏపీలో కొత్తగా 100 పడకల ESI ఆసుపత్రి.. ఏ జిల్లాలో తెలుసా?
ఏపీలో కొత్తగా 100 పడకల ESI ఆసుపత్రి.. ఏ జిల్లాలో తెలుసా?
7 గంటల కంటే తక్కువ నిద్రపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?
7 గంటల కంటే తక్కువ నిద్రపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?
భారీ మొత్తంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్న వారికి అలర్ట్‌!
భారీ మొత్తంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్న వారికి అలర్ట్‌!
సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో బూమ్రా
సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో బూమ్రా
భూకంపంతో వణికిపోయిన జపాన్..ఇవిగో ఆ భయానక దృశ్యాలు..వీడియోలు వైరల్
భూకంపంతో వణికిపోయిన జపాన్..ఇవిగో ఆ భయానక దృశ్యాలు..వీడియోలు వైరల్