India Corona: గుడ్‌న్యూస్.. దేశంలో తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని మరణాలు నమోదయ్యాయంటే..?

గత 24 గంటల్లో (ఆదివారం) కరోనా (Covid-19) కేసుల సంఖ్య 3,207 నమోదైంది. శనివారంతో పోల్చుకుంటే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది..

India Corona: గుడ్‌న్యూస్.. దేశంలో తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని మరణాలు నమోదయ్యాయంటే..?
India Coronavirus

Updated on: May 09, 2022 | 9:38 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్-19 థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా అందోళన వ్యక్తమవుతోంది. కాగా.. గత 24 గంటల్లో (ఆదివారం) కరోనా (Covid-19) కేసుల సంఖ్య 3,207 నమోదైంది. శనివారంతో పోల్చుకుంటే (3,805) 600 కేసులు తగ్గాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 29 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 20,403 (0.05 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 0.95 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

దేశంలో నమోదైన కేసులు, రికవరీ వివరాలు..

ఇవి కూడా చదవండి
  • దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,31,05,401 కి చేరింది.
  • కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,24,093 కి పెరిగింది.
  • నిన్న కరోనా నుంచి 3,410 మంది కోలుకున్నారు.
  • వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,25,60,905 కి చేరింది.
  • ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.74 శాతం ఉంది.
  • దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 190,34,90,936 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
  • నిన్న 13,50,622 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
  • దేశవ్యాప్తంగా నిన్న 3,36,776 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
  • ఇప్పటివరకు 84.10 కోట్ల పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి

Also Read:

Atta Price: రికార్డులు కొల్లగొడుతున్న గోధుమ పిండి ధర.. 12 ఏళ్ల తర్వాత భారీగా పెరుగుతున్న రేట్లు..

Silver Smuggling: స్మగ్లర్ల కొత్త ఐడియా.. పట్టించిన సీక్రెట్​క్యాబిన్​.. చెక్ చేస్తే 1900 కిలోల వెండి..