ప్రతి ఏడాది డిసెంబర్ మాసంలోనే కోవిడ్ వ్యాప్తి పెరగడానికి కారణం ఇదే
దేశంలో కరోనా మళ్లీ హడలెత్తిస్తోంది. డిసెంబర్ లోనే కేసులు పెరగడం వెనుక వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వ్యాప్తిస్తున్న జేఎన్ 1 వేరియంట్‌తో భయం అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. అందుబాటులో వ్యాక్సిన్లు ఈ వేరియంట్ నుంచి రక్షణ కల్పిస్తాయని చెబుతున్నారు.

దేశంలో కరోనా టెర్రర్ మళ్లీ భయపెడుతోంది. మళ్లీ డిసెంబర్‌లోనే మరో వేరియంట్ రూపంలో వైరస్ మనముందుకొచ్చింది. కరోనా ప్రధానంగా మూడు ప్రధాన మ్యుటేషన్లుగా మార్పు చెందింది. డిసెంబర్ 2020లో వ్యాప్తి చెందిన కరోనా ఆల్ఫా(B.1.1.7), బీటా(B.1.351), గామా(P.1)గా మార్పు చెందింది. మరుసటి ఏడాది 2021 డిసెంబర్‌లో ఉద్భవించింన ఒమిక్రాన్ వేరియంట్ భారీ నష్టాన్ని మిగిల్చింది. మరుసటి ఏడాది డిసెంబర్ 2022లో ప్రధాన వేరియంట్ వ్యాప్తి చెందనప్పటికీ ఒమిక్రాన్‌లోనే BA.2, BA.5గా పరిణామం చెందింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న JN1 కూడా ఒమిక్రాన్ వేరియంట్‌లోని ఉపరకమే. ఇది కూడా డిసెంబర్‌లోనే వ్యాప్తి చెందుతోంది.
ప్రతి ఏడాది డిసెంబర్ మాసం నుంచి కొవిడ్-19 కొత్త రకంగా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం వాతావరణ పరిస్థితులే. శీతాకాలంలోని చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగానే వైరస్ మార్పు చెంది వేగంగా వ్యాప్తి చెందుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. డెల్టా వేరియంట్, మహమ్మారి మొదటి దశలోనూ వైరస్ వ్యాప్తికి గల కారణాలపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయని నేచర్ జర్నల్ పేర్కొంది. వేసవి నుంచి శీతాకాలానికి మారినప్పుడు ఉష్ణోగ్రత పడిపోతుంది. గాలి కూడా పొడిగా మారుతుంది. . చైనాలోని సిచువాన్ ఇంటర్నేషనల్ స్టడీస్ యూనివర్శిటీ పరిశోధకులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. వెచ్చని పరిస్థితుల్లోని వారికంటే చల్లని పరిస్థితుల్లో నివసించేవారికి కరోనావైరస్ సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది.
కరోనా వేరియంట్ చైనాలో డిసెంబర్‌లోనే బయటపడింది. ఈ నెలలోనే విపరీతంగా వ్యాప్తి చెందింది. ఉత్తర, దక్షిణ అర్ధగోళంలో డిసెంబర్ నెలలో ఎక్కువగా సెలువులు ఉన్నాయి. క్రిస్టమస్ సెలవులు, చైనాలో జనవరిలో లునార్ న్యూ ఇయర్ వేడుకలు వైరస్ వ్యాప్తికి దోహదం చేశాయి. ఈ సారి జేఎన్1 వేరియంట్ కూడా సరిగ్గా ఇదే సమయంలో వ్యాప్తి చెందుతోంది.
ప్రస్తుతం వ్యాప్తిస్తున్న జేఎన్ 1 వేరియంట్‌తో భయం అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొన్నారు. మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు జేఎన్ 1 వేరియంట్ నుంచి కూడా రక్షిస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…