CBSE Board: సీబీఎస్ఈ కీలక ఆదేశాలు.. ఆ విద్యార్ధులకు ఫీజుల నుంచి మినహాయింపు.!

| Edited By: Anil kumar poka

Sep 23, 2021 | 5:14 PM

CBSE Board: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్ధులకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) గుడ్ న్యూస్ అందించింది...

CBSE Board: సీబీఎస్ఈ కీలక ఆదేశాలు.. ఆ విద్యార్ధులకు ఫీజుల నుంచి మినహాయింపు.!
Students
Follow us on

కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్ధులకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) గుడ్ న్యూస్ అందించింది. వారికి పరీక్ష, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి మినహాయింపు కలిగిస్తున్నట్లు ప్రకటించింది. అలాంటి విద్యార్ధులకు సంబంధించిన వివరాలను సేకరించాలని కోరింది. ఈ మేరకు పాఠశాలలకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.

”కోవిడ్ మహమ్మారి విద్యార్ధులపై తీవ్ర ప్రభావం చూపించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని 2021-22 సంవత్సరానికి గానూ సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల నుంచి పరీక్ష ఫీజులు లేదా రిజిస్ట్రేషన్ ఫీజులను వసూలు చేయవద్దు” అని సీబీఎస్ఈ బోర్డు ఓ ప్రకటనలో తెలియజేసింది.

ప్రస్తుతం 10, 12వ తరగతి విద్యార్ధులకు సంబంధించిన వివరాలను స్కూల్స్ సేకరించి సెప్టెంబర్ 30వ తేదీలోగా పంపాలని.. లేట్ ఫీజుతో అక్టోబర్ 9లోగా పంపొచ్చునని సీబీఎస్ఈ బోర్డు తెలిపింది. మరోవైపు ఈ ఏడాది సీబీఎస్ఈ బోర్డు రెండు సెట్లలో బోర్డు పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కోవిడ్ కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా మొదలు కావడంతో.. విద్యార్ధులపై ఎలాంటి ఒత్తిడి పడకుండా ఉండేందుకు నవంబర్-డిసెంబర్ మధ్యలో 10, 12వ తరగతుల విద్యార్ధులకు ఫస్ట్ సెట్ పరీక్షలను.. అలాగే 2022వ సంవత్సరం మార్చి-ఏప్రిల్ మధ్యలో రెండో సెట్ పరీక్షలను నిర్వహించాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!