Covishield: కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య గడువు తగ్గించిన కేంద్రం ప్రభుత్వం.. వారికి మాత్రమే..!

|

Jun 11, 2021 | 11:34 AM

Covishield: కరోనా కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలో చాలా మందికి వ్యాక్సిన్‌ వేశారు. అయితే కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య గ్యాప్‌పై..

Covishield: కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య గడువు తగ్గించిన కేంద్రం ప్రభుత్వం.. వారికి మాత్రమే..!
Covishield
Follow us on

Covishield: కరోనా కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలో చాలా మందికి వ్యాక్సిన్‌ వేశారు. అయితే కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య గ్యాప్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘కొవిషీల్డ్‌’ టీకా రెండు డోసుల మధ్య ఎడం 12-16 వారాలుగా కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. కొన్ని వర్గాల ప్రజలకు ఈ వ్యవధిని తగ్గిస్తూ నిబంధనల్లో కేంద్రం కొన్ని సవరణలు చేసింది. చదువుల కోసం తమ దేశానికి వచ్చే విద్యార్థులు, ఇంకా ఉద్యోగులు, క్రీడాకారులకు పలు దేశాలు వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేస్తున్నాయి. దీంతో ఆయా వ్యక్తులకు రెండో డోసు విషయంలో గడువును తగ్గించింది.

తాజా మార్గదర్శకాలు ప్రకారం..

విద్యాభ్యాసానికి విదేశాలకు వెళ్లే విద్యార్థులు, విదేశాల్లో ఉద్యోగావకాశం వచ్చిన వారు, క్రీడాకారులు, టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే సిబ్బందికి 84 రోజుల కంటే ముందుగానే ‘కొవిషీల్డ్‌’ రెండో డోసు వేసుకోవచ్చు. అయితే ఈ మూడు గ్రూపులవారి వివరాలను సమీక్షించి, అనుమతులు ఇచ్చేందుకు ప్రతిజిల్లాలో అధికారులను ఆయా రాష్ర్టాలు ఏర్పాటు చేయాలి. మొదటి, రెండో డోసుకు మధ్య గ్యాప్‌ కనీసం 28 రోజులు ఉండాలి. అలాగే ఈ వ్యక్తులు తొలి డోసు తీసుకొని 28 రోజులు పూర్తయిందా? విదేశీ ప్రయాణానికి వారు సమర్పిస్తున్న పత్రాలు సరైనవా? తదితర వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని కేంద్రం సూచించింది. ఆగస్టు 31లోపు అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. వ్యాక్సిన్ కోసం గుర్తింపు పత్రాలలో ఒకటిగా పాస్‌పోర్ట్‌ను ఉపయోగించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు సూచించాయి. టీకా సర్టిఫికెట్‌లో పాస్‌పోర్ట్ నంబర్ ముద్రించబడుతుంది. మొదటి డోసును పొందటానికి ఏ ఇతర గుర్తింపు కాగితాన్ని ఉపయోగించినా అభ్యంతరం లేదు. కోవిన్ యాప్‌లో ఇందుకు సంబంధించిన సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది.

ఇవీ కూడా చదవండి:

Covid-19 Vaccine Certificate: కోవిడ్‌ టీకా సర్టిఫికెట్‌లో లోపాలున్నాయా..? అయితే ఇలా సరి చేసుకోండి..!

Covaxin Vaccine: కోవాక్సిన్ మొదటి టీకా తీసుకున్నాక రెండవ డోసు తీసుకోవడానికి ఆలస్యం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా ?