ముంబయి(Mumbai) నగరంలోని వసాయ్ ప్రాంతానికి చెందిన సాగర్ అరుణ్ నాయక్ ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం వారి కుటుంబసభ్యులకు తెలిసింది. వీరి పెళ్లికి వారు కూడా అంగీకరించారు. త్వరలోనే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి ఫిబ్రవరి 27వ తేదీన ఓ హోటల్ కు వెళ్లారు. రోజంతా గడిచినా వారు బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. ఎన్ని సార్లు తలుపులు కొట్టినా స్పందన రాలేదు. దీంతో విసిగిపోయి తలుపు బద్దలుకొట్టారు. లోపలికెళ్లి చూసేసరికి వారికి భీతావహ దృశ్యం కనిపించింది. యువతి విగతజీవిగా కనిపించింది. ప్లంబింగ్ పనిముట్టుతో ఆమెను కొట్టి, హత్య(Murder) చేసినట్లు సిబ్బంది గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలి ప్రియుడే ఆమెను హత్య చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అనుమానితుడిగా సాగర్ పేరు చేర్చి గాలింపు మొదలుపెట్టారు.
యువతి మరణం తర్వాత సాగర్ కనిపించకుండా పోవడంతో అతని మీద అనుమానం మరింత ఎక్కువైంది. దర్యాప్తు ముమ్మరం చేపట్టిన పోలీసులు బీహార్ ఓ హోటల్ గదిలో సాగర్ శవమై కనిపించాడు. యువతి హత్య అనంతరం బీహార్‌కు చేరుకున్న సాగర్ ముజఫర్‌పూర్‌ని ఆస్తా హోటల్ లో దిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మార్చి 6వ తేదీనే హోటల్ ఖాళీ చేయాల్సి ఉండగా.. అది జరగలేదు. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది డోర్లు లోపల నుంచి లాక్ చేసి ఉండడం గమనించారు. సాగర్ ఫోన్‌కు ట్రై చేసినా స్పందన లేకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సిబ్బంది సాయంతో తలుపులు బద్ధలు కొట్టారు. లోపల బాత్‌రూంలో సాగర్ చనిపోయి కనిపించాడు.
Also Read
Women’s Day 2022: వైకుంఠధామమే ఆమె నివాసం.. స్మశానమే సర్వస్వం.. మహిళా కాటి కాపరి ప్రత్యేక కథనం
Singareni Mines: సింగరేణి గని ప్రమాదంలో లభ్యం కానీ ఆచూకీ.. ఆవేదనలో బాధిత కుటుంబాలు