India Corona update: దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. కొత్తగా 1,73,790 కేసులు నమోదు

Corona Cases In India: దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,73,790 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి...

India Corona update: దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. కొత్తగా 1,73,790 కేసులు నమోదు
India Corona Updates

Edited By: Team Veegam

Updated on: May 29, 2021 | 3:20 PM

Corona Cases In India: దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,73,790 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,29,247కి చేరింది. ఇందులో 22,28,724 యాక్టివ్ కేసులు ఉండగా, 2,51,78,011 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న 3617 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,22,512కి చేరుకుంది. నిన్న కొత్తగా 2,84,601 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇదిలా ఉంటే నిన్న ఒక్క రోజులో 20,80,048 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగినట్లు ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ తెలిపింది. దీనితో ఇప్పటివరకు మొత్తంగా 34,11,19,909 మందికి కోవిడ్ టెస్టులు చేశారు. అటు ఇప్పటిదాకా 20,89,02,445 మందికి వ్యాక్సినేషన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా…Watch Video

Also Read:

మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?

టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?

సర్కస్‌ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!