Corona India: దేశ ప్రజలకు ఊరట.. భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!

|

May 25, 2021 | 3:18 PM

Corona Cases In India: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,96,427 కొత్త పాజిటివ్...

Corona India: దేశ ప్రజలకు ఊరట.. భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!
India Corona Updates
Follow us on

Corona Cases In India: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,96,427 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,69,48,874కి చేరింది. ఇందులో 25,86,782 యాక్టివ్ కేసులు ఉండగా, 2,40,54,861 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న 3511 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,07,231కి చేరుకుంది. నిన్న కొత్తగా 3,26,850 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, ఇప్పటిదాకా వ్యాక్సినేషన్ 19,85,38,999 మందికి ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ…

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 19.84 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. సోమవారం రాత్రి 8 గంటల వరకు 19,84,43,550 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. 18-44 మధ్య వయస్సున్న 12,52,320 మందికి సోమవారం మొదటి డోసు వేసినట్లు కేంద్రం వెల్లడించింది.

మూడో దశ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 1,18,81,337 మందికి మొదటి డోసు అందజేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే.. బీహార్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 18-44 సంవత్సరాల వయస్సున్న వారికి 10 లక్షలకుపైగా డోసులు వేశారని వివరించింది. టీకాల పంపిణీ కార్యక్రమం సోమవారం నాటికి 129వ రోజు చేరగా.. ఒకే రోజు 23,65,395 వ్యాక్సిన్‌ డోసులు అందించినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇందులో 21,90,849 మందికి మొదటి డోసు ఇవ్వగా.. 1,74,546 మందికి రెండో డోసు అందజేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Also Read:

చిరుత, పైథాన్ మధ్య భీకర పోరు.. గగుర్పొడిచే వైరల్ వీడియో.. విజేత ఎవరో తెలుసా.!

మందు గ్లాస్‌తో మతిపొగొట్టిన బుడ్డొడు… నెటిజన్లు ఫిదా.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!

పెళ్లికి ముందు ఆ నటితో విరాట్ కోహ్లీ ఎఫైర్.. ఆమె ఎవరంటే.!

వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? అయితే డేంజరే.! ఏవి పెట్టాలో తెలుసుకోండి.!