Corona Cases India: దేశంలో కరోనా కల్లోలం.. కొత్తగా 1.31 లక్షల పాజిటివ్ కేసులు, 802 మరణాలు.!

Corona Cases In India: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తోంది. రోజురోజుకూ పెరుగుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య ప్రజల్ని హడలెత్తిస్తోంది..

Corona Cases India: దేశంలో కరోనా కల్లోలం.. కొత్తగా 1.31 లక్షల పాజిటివ్ కేసులు, 802 మరణాలు.!
Coronavirus In India

Updated on: Apr 09, 2021 | 9:30 AM

Corona Cases In India: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తోంది. రోజురోజుకూ పెరుగుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య ప్రజల్ని హడలెత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,31,918 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే వైరస్ కారణంగా 802 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 9.74 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.

నిన్న మహారాష్ట్రలో 56,286 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఛతీస్‌గడ్‌లో 10,652 కేసులు, ఉత్తరప్రదేశ్‌లో 8474, ఢిల్లీలో 7437, కర్నాటకలో 6570, కేరళలో 4353 పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. కరోనా కేసులు ప్రతీ రోజూ పెరుగుతోన్న నేపధ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలు, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి.

దేశంలో మరోసారి లాక్‌డౌన్ లేదన్న మోదీ…

దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ లేదని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. అలాగని కరోనాను లైట్ తీసుకోవద్దని రాష్ట్రాలకు సూచించారు. టెస్టులు చేయడంతో పాటు వ్యాక్సినేషన్‌లో వేగం పెంచాలని కోరారు. మాస్ వ్యాక్సినేషన్ కోసం ఏప్రిల్ 11 నుంచి 14 వరకూ వ్యాక్సినేషన్ ఉత్సవ్ నిర్వహించాలని ప్రకటించారు.

ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నందున మరోసారి లాక్‌డౌన్ పెట్టే ఉద్దేశం లేదని ప్రధాని మోదీ రాష్ట్రాలకు తెలిపారు. సెకండ్ వేవ్‌లో కరోనా కేసుల పెరుగుదల ప్రమాదకరంగా ఉందని.. దీన్ని కట్టడి చేసేందుకు ఎక్కడికక్కడ కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా కట్టడికి రాత్రి పూట కర్ఫ్యూ మంచి ప్రత్యామ్నాయమని అన్నారు. రాత్రి పూట కర్ఫ్యూకి కరోనా కర్ఫ్యూగా పేరు పెట్టాలని కోరారు. కొన్ని రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయన్న మోదీ.. కేసుల్ని తగ్గించేందుకు టెస్టింగ్, ట్రాకింగ్, ట్రేసింగ్ తప్పదని సూచించారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచడం…కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి వైరస్ సోకిన వాళ్లను ఐసోలేట్ చేయడం ముఖ్యమని చెప్పారు.

Also Read:

‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌’.. దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే.!

ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!

ఇంటి గుమ్మంలో తిష్టవేసిన సింహాలు.. డోర్ తీసి కంగుతిన్న యజమాని.. కట్ చేస్తే ఊహించని సంఘటన.!