Coronavirus: మళ్లీ పడగవిప్పుతోన్న కరోనా మహమ్మారి.. దేశ వ్యాప్తంగా పెరుగుతోన్న కేసుల సంఖ్య..

Coronavirus: దేశంలో ఖతం అనుకున్న కరోనా మళ్లీ బుసలు కొడుతోంది. కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 4041 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో...

Coronavirus: మళ్లీ పడగవిప్పుతోన్న కరోనా మహమ్మారి.. దేశ వ్యాప్తంగా పెరుగుతోన్న కేసుల సంఖ్య..
Corona
Image Credit source: Corona

Updated on: Jun 03, 2022 | 9:03 PM

Coronavirus: దేశంలో ఖతం అనుకున్న కరోనా మళ్లీ బుసలు కొడుతోంది. కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 4041 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో పోరాడుతూ పదిమంది చనిపోయారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న ఐదు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ లేఖలు రాశారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు- రిస్క్‌ అసెస్‌మెంట్‌ ఆధారిత విధానాన్ని అనుసరించాలని కోరారు. పరిస్థితులకు తగినట్లు అప్రమత్తత పెంచాలని, కరోనా వ్యాప్తి అరికట్టడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని రాజేష్‌ భూషణ్‌ పిలుపునిచ్చారు.

ఇక విమానాల్లో ప్రయాణించేవారు కరోనా రూల్స్‌ పాటించకపోతే, బయటకు పంపించండి అంటూ ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. మాస్కులు ధరించకపోతే భారీ జరిమానాలు విధించాలని- ఢిల్లీ హైకర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్ విపిన్‌ సంఘి చెప్పారు. కరోనా నిబంధనలను పాటించని ప్రయాణికులను తొలగించే అధికారం విమానయాన సిబ్బందికి ఇస్తూ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయాలని- ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణలో భాగంగా ధర్మాసనం ఆదేశించింది. ఇక దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 21 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 4041 కేసులు నమోదయ్యాయి. మూడు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని కరోనా వార్తల కోసం క్లిక్ చేయండి..