‘అవినీతిలో కాంగ్రెస్, బీజేపీ రెండూ రెండే !’ అరవింద్ కేజ్రీవాల్ ఫైర్
అవినీతిలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండూ రెండే అని ఆరోపించారు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ! కరప్షన్ విషయానికి వచ్ఛేసరికి ఈ రెండు పార్టీలను సమానంగా చూడాలన్నారు. దేశాన్ని మొదట కాంగ్రెస్ పార్టీ దోచుకోగా, ఆ తరువాత బీజేపీ దాని స్థానంలోకి వచ్చిందన్నారు. 2014 లో అధికారాన్ని కోల్పోయాక కాంగ్రెస్ ఈ విషయంలో తెర వెనక్కి వెళ్ళింది.. ఇక బీజేపీ వంతు వచ్చింది అని ఆయన వ్యాఖ్యానించారు. రైతు చట్టాలను మోదీ ప్రభుత్వం […]
అవినీతిలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండూ రెండే అని ఆరోపించారు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ! కరప్షన్ విషయానికి వచ్ఛేసరికి ఈ రెండు పార్టీలను సమానంగా చూడాలన్నారు. దేశాన్ని మొదట కాంగ్రెస్ పార్టీ దోచుకోగా, ఆ తరువాత బీజేపీ దాని స్థానంలోకి వచ్చిందన్నారు. 2014 లో అధికారాన్ని కోల్పోయాక కాంగ్రెస్ ఈ విషయంలో తెర వెనక్కి వెళ్ళింది.. ఇక బీజేపీ వంతు వచ్చింది అని ఆయన వ్యాఖ్యానించారు. రైతు చట్టాలను మోదీ ప్రభుత్వం తేవడాన్ని కేజ్రీవాల్ తీవ్రంగా తప్పు పట్టారు. వీటిని పూర్తిగా ఉపసంహరించాలన్నారు. పంజాబ్ నుంచి వఛ్చిన ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. రైతు బిల్లులను రూపొందిస్తున్నప్పుడు సంబంధిత కమిటీలో ఉన్న కాంగ్రెస్ నేత ఒకరు.. బీజేపీని అభినందించారని, అయితే పార్లమెంటులో అది చట్టమయ్యాక నిరసన తెలుపుతున్నారని అన్నారు. ప్రజలు మూర్ఖులా అని ఆవేశంగా పేర్కొన్నారు.