Sonia Gandhi Health Updates: ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్.. డాక్టర్లు ఏమని సలహా ఇచ్చారంటే..

|

Jun 20, 2022 | 6:50 PM

Sonia Gandhi Discharged From Hospital: కోవిడ్ అనంతర సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరిన వారం రోజుల తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు ఢిల్లీలోని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.

Sonia Gandhi Health Updates: ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్.. డాక్టర్లు ఏమని సలహా ఇచ్చారంటే..
Sonia Gandhi Discharged Fro
Follow us on

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతానికి ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. సోనియా గాంధీ(75)కి జూన్ 2న కరోనా వైరస్ సోకింది. కోవిడ్-19 తర్వాత వచ్చిన సమస్యల కారణంగా జూన్ 12న ఆమె సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. కాంగ్రెస్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఆసుపత్రిలో చేరిన తరువాత, ఆమెకు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. జూన్ 12న సోనియాగాంధీ ముక్కు నుంచి రక్తం వచ్చిందని కాంగ్రెస్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌ఛార్జ్‌ జైరాం రమేష్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆస్పత్రిలో చేర్పించారు.

నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జూన్ 23న విచారణకు హాజరు కావాలని సోనియా గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా సమన్లు ​​జారీ చేసింది. సోనియాగాంధీని ముందుగా జూన్ 8న హాజరుకావాలని కోరారు. అయితే ఆమెకు కరోనా వైరస్ సోకినందున దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావడానికి మరో తేదీని కోరారు.

ఇప్పటికే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని విచారిస్తున్న దర్యాప్తు సంస్థ ఇవాళ కూడా ఈడీ ఎదుట హాజరయ్యారు. రాహుల్ విచారణ కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

జాతీయ వార్తల కోసం